ఉత్తరాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా ఎదిగింది. తొలుత వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో బీజేపీ పుంజుకోగా.. ఇక ఆ తరువాత నరేంద్రమోడీ ప్రధానిగా రెండు సార్లు గెలుపొంది బీజేపీని బలంగా తయారు చేశారు. ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీ విజయం సాధిస్తుంది. ఇటీవల తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్ ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచింది. ఉత్తరాది రాష్ట్రాల మాదిరిగా దక్షిణాదిన కూడా పాగా వేయాలని ప్రయత్నిస్తోంది.
Advertisement
దక్షిణ భారతదేశంలో కర్నాటక తప్ప ఏ రాష్ట్రంలో కూడా బీజేపీకి పెద్దగా ఆదరణ లేకుండా పోయింది. ఇకపోతే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని ప్రయత్నిస్తుంది బీజేపీ. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. ఒకవేళ అధికారంలోకి వచ్చిన ఈసారి బీజేపీకి ఎంపీ సీట్లు తగ్గే అవకాశం లేకపోలేదు. కేంద్రంలో అధికారంలకి ఏ పార్టీ రావాలనేది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఎక్కువగా 80 ఎంపీ సీట్లు ఉండడంతో అక్కడ బీజేపీ 50 సీట్లు సాధించినా మిగతా దగ్గర అవి కవర్ చేసుకోవచ్చు అని మోడీ-అమిత్ షా నిర్ణయించినట్టు సమాచారం.
Advertisement
ఇక దక్షిణాది రాష్ట్రాల్లో మొన్నటి వరకు కేంద్రానికి చేదోడు వాదోడుగా ఉన్న కేసీఆర్ ఒక్కసారిగా రివర్స్ అయ్యాడు. కేసీఆర్‌తో స్నేహపూర్వకంగా ఉంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం చాలా కష్టమని.. ప్రత్యర్థిగా ఉంటేనే లెక్కలు తేల్చుకోవడం చాలా ఈజీ అని భావించింది. వచ్చే ఏ ఎన్నికల్లో అయినా బీజేపీ సత్తా చాటేందుకు చాలా పట్టుదలతో ఉంది. మిగిలిన పార్టీ అధినేతలతో పోల్చితే టీఆర్ఎస్ అధినేత వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుందని అధినాయకత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో శత్రువు మిత్రుడన్న నానుడికి తగ్గట్టుగానే కేసీఆర్ కి అసలు పడని చంద్రబాబుని తమతో జట్టు కట్టేలా చేసేందుకు మోడీ-అమిషా వ్యూహ రచన చేస్తున్నారు.
తెలంగాణలో కేసీఆర్ ను దెబ్బ తీసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమికి కేసీఆర్ కీలకంగా వ్యవహరించినట్టు చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ఉపయోగించుకుని కేసీఆర్ ని ఓడించడానికి బీజేపీ పథక రచన చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబుకి హైదరాబాద్‌లోని సెటిలర్స్ సపోర్టు ఇప్పటికీ ఉంటుంది. ఈసారి బాబుతోనే కేసీఆర్‌కి చెక్ పెట్టాలని తాజా సమావేశాలు అందుకు ఊతం పోస్తున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి మునుగోడు నుంచి మళ్లీ పోటీ చేయనున్నట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మాత్రం తెలంగాణలో బీజేపీ పుంజుకున్నట్టే లెక్కని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తెలంగాణలో బీజేపీకి టీఆర్ఎస్ చెక్ పెడుతుందో లేదో వేచి చూడాలి మరి.
Also Read :
పెళ్లి చేసుకోమని అతను ఆరేళ్లుగా వేధించాడు.. సంచలన విషయాలు వెల్లడించిన నిత్యామీనన్
Chanakya Niti : ఇంటి పెద్దకు ఉండాల్సిన లక్షణాలు ఇవే..!