Home » గంగూలీపై విరుచుపడ్డ గంభీర్.. అది తప్పు అంటూ..?

గంగూలీపై విరుచుపడ్డ గంభీర్.. అది తప్పు అంటూ..?

by Azhar
Ad
భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. ఈ మధ్య కాలంలో చేస్తున్న కామెంట్స్ అనేవి వైరల్ గా మారుతున్నాయి. క్రికెట్ ప్రపంచంలో ఉండే వారిపైన షాకింగ్ కామెంట్స్ చేస్తూ వస్తున్నాడు. నిన్ననే.. కోహ్లీ, ధోనీలను ఫ్యాన్స్ ఆరాధించడం మానేయాలి అని చెప్పాడు. ఇక ఈరోజు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేస్తున్న ఆ పని తప్పు అంటూ చెప్పాడు.
అయితే క్రికెట్ లో బెట్టింగ్ అనే దానిని పూర్తిగా మాయం చేయాలి అని కామెంట్స్ చేసిన గంభీర్… గంగూలీ వంటి వారే దానిని ప్రోత్సహిస్తున్నారు అని కూడా చెప్పాడు. బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్న గంగూలీ వంటి వ్యక్తి స్వయంగా ఆన్లైన్ బెట్టింగ్ లను ఐపీఎల్ సమయంలో ప్రోత్సహిస్తున్నారు. వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నారు. కానీ ఇది తప్పు. దేశ బోర్డును నడిపిస్తున్న వ్యక్తి ఇలాంటి పనులు చేయడం సరికాదు అని చెప్పాడు.
ఇలాంటి యాప్స్ ను ప్రోత్సహించడం ద్వారా కొంత మందికి మాత్రమే మేలు జరుగుతుంటే.. చాలా మంది తమ డబ్బును కోల్పోతున్నారు. ఐపీఎల్ సమయంలో ఇలాంటి చాలా యాప్స్ అనేవి స్పాన్సర్‌షిప్‌ చేస్తాయి. కానీ వాటిని కొనసాగించాలా వద్ద అనేది బీసీసీఐ పెద్దలు అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పాడు. అయితే పలు బెట్టింగ్ యాప్స్ కు గంగూలీతో పాటుగా.. ధోని, కోహ్లీ వంటి వారు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Visitors Are Also Reading