Home » క్రికెట్ లోకి ఐసీసీ తెచ్చిన ఈ కొత్త నిబంధనలు మీకు తెలుసా..?

క్రికెట్ లోకి ఐసీసీ తెచ్చిన ఈ కొత్త నిబంధనలు మీకు తెలుసా..?

by Azhar
Ad
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ క్రికెట్ నియమాల్లో కొన్ని మార్పులు చేసింది. కొత్తగా కొన్ని నియమాలు తెచ్చి.. క్రికెట్ ను ఇంకా పద్దతిలో పెట్టాలి అని చూస్తుంది. అయితే ఐసీసీ తెచ్చిన ఈ కొత్త నియమాలు వచ్చే నెల 1 నుండి అమలులోకి వస్తాయి. ఇన్ని రోజు క్యాచ్ ఔట్ సమయంలో.. ఫీల్డర్ క్యాచ్ పట్టడానికి ముందే.. బ్యాటరర్లు ఒక్కరిని ఒక్కరు క్రాస్ చేస్తే.. కొత్తగా వచ్చిన బ్యాటర్ కు స్ట్రైక్ రాదు.
కానీ ఇప్పుడు క్యాచ్ ఔట్ సమయంలో ఏం అయిన.. కొత్తగా వచ్చే బ్యాటర్ స్ట్రైక్ తీసుకోవాలి. అదే విధంగా ఒక్క బ్యాటర్ ఔట్ అయిన తర్వాత కొత్త బ్యాటర్.. టీ20ల్లో అయితే 90 సెకన్లు.. వన్డే, టెస్టులో అయితే రెండు నిమిషాల్లో క్రీజులోకి రావాలి. లేదంటే.. అతడిని ఔట్ గా పరిగణిస్తారు. స్లో ఓవర్ రేట్ ను తగ్గించడానికి ఈ నియమం తీసుకున్నారు. వన్డేలో ఈ నియమం 2023 ప్రపంచ కప్ తర్వాత అమల్లోకి వస్తుంది.
ఇక కరోనా సమయంలో బంతి పైన ఉమ్మిని రాయకూడదు అనే నియమం తెచ్చింది ఐసీసీ. ఇప్పుడు ఆ రూల్ ను శాశ్వతం చేసింది. ఇక బౌలర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో మిగిలిన ఏ ఆటగాడు అయిన బ్యాటర్ దృష్టి అనేది మరల్చడానికి ప్రయత్నిస్తే.. ఆయా బంతిని డెడ్ బాల్ గా పరిగణిస్తారు. అంతే కాకుండా పెనాల్టీగా ప్రత్యర్థి జట్టుకు 5 పరుగులు కూడా ఇస్తారు.

Advertisement

Visitors Are Also Reading