ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అంటే దేశంలో తెలియని వారు ఉండరు. మొన్న జరిగిన 6 రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్లో అధికారాన్ని సాధించి తమ పట్టు నిలుపుకున్నారు. అంతటి ఘనత ఉన్న సీఎంను బిజెపి నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆయనపై కోపానికి వస్తున్నారు. మర్యాద తెలియని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అంటూ ట్విట్టర్ లో విమర్శిస్తున్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో పీఎం మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Advertisement
చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు, పరిస్థితుల మీద సమీక్ష నిర్వహించారు. దీని అనంతరం ముఖ్యమంత్రులను ఉద్దేశించి పి ఎం మాట్లాడారు. అయితే లైవ్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమావేశం జరుగుతున్న సమయంలో మధ్యలో ఒకసారి కుర్చీ పై వెనక్కి వాలి రెండు చేతులు తల వెనుక పెట్టుకొని ఏమీ పట్టనట్లుగా చూస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగం పట్టించుకోవడంలేదని, మోడీని అగౌరవ పరిచేలా అతని తీరు ఉందని బిజెపి నాయకులు మండిపడుతున్నారు.
Advertisement
మర్యాద లేని ఢిల్లీ ముఖ్యమంత్రి అంటూ విమర్శిస్తున్నారు. ఈ మేరకు బీజేపీ అధికారిక ట్విట్టర్ లో దీనికి సంబంధించి నటువంటి వీడియోను పోస్ట్ చేసింది. వారు షేర్ చేసిన 19 సెకన్లలోనే వీడియో క్లిప్ లో కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మయి, ఏపీ సీఎం జగన్, చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తదితరులు ఉన్నారు.
ALSO READ;
రేవంత్‌రెడ్డిని రియల్ టైగర్ ఆఫ్ తెలంగాణగా వర్ణించిన వర్మ
శ్రీశైలంలో వాహనాలపై బొమ్మలు ఎందుకు వేస్తారో తెలుసా..?