అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ఈ పాకిస్తాన్ మహిళా క్రికెటర్లు తుఫాన్‌తో బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు. బిస్మా మరూఫ్, అలియా రియాజ్ కలిసి పాకిస్తాన్ తరుపున సరికొత్త రికార్డు సృష్టించారు. వీరిద్దరూ ప్రపంచకప్ చరిత్రలో 25 ఏండ్ల నాటి రికార్డును క్రాస్ చేశారు. అద్భుతమైన బ్యాటింగ్, భాగస్వామ్యంతో ఆస్ట్రేలియాపై ఈ ఘనత సాధించారు. ప్రపంచకప్ పిచ్‌పై 1997 తరువాత పాకిస్తాన్ ఏ మహిళా బ్యాట్స్‌మెన్ చేయని పనిని వీరిద్దరూ చేశారు.
Advertisement
భాగస్వామ్య పరంగా మహిళల ప్రపంచకప్ చరిత్రలో పాకిస్తాన్ తరుపున బిస్మా, అలియా సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ విషయంలో వీరిద్దరూ కలిసి 25 ఏళ్లనాటి రికార్డును తిరగరాశారు. బిస్మా, అలియా ఇరువురూ తమ అర్థ సెంచరీ ఇన్నింగ్స్‌లకు స్కిప్ట్ రాశారు. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బిస్మా మరూఫ్, అలియా రియాజ్ మధ్య 5వ వికెట్కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొంది.
Advertisement
ప్రపంచకప్ పిచ్‌లో ఏ వికెట్ కు అయినా పాకిస్తాన్‌కు ఇదే అతి పెద్ద భాగస్వామ్యంగా నిలిచింది. అంతకు ముందు 1997 సంవత్సరంలో మలీహా హుస్సెన్, షర్మిన్ ఖాన్ మధ్య 84 పరుగుల భాగస్వామ్యం సాధించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలలో దీనిని సాధించారు. మ్యాచ్‌లో బిస్మా మరుఫ్ 122 బంతుల్లో 8 ఫోర్లతో అజేయంగా 78 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాతో మహిళల వన్డేలో పాక్ బ్యాట్స్‌మెన్ సాధించిన అత్యధిక స్కోరు ఇదే.
బిస్మా 122 బంతుల్లో 78 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియాతో మహిళల వన్డేలో పాక్ బ్యాట్స్ మెన్ సాధించిన స్కోరు ఇదే కావడం విశేషం. ఈ సమయంలో ప్రపంచ కప్ పిచ్ పై పాకిస్తానీ చేసిన రెండవ భారీ స్కోరుగా నిలిచింది. బిస్మా వన్డే కెరీర్‌లో 15వ అర్థసెంచరీ. మరొక ఎండ్‌లో అలియా రియాజ్ 109 బంతులు ఎదుర్కొని 53 పరుగులు చేసింది. ప్రపంచకప్‌లో ఆమెకు ఇదే తొలి హాఫ్ సెంచరీ. వన్డే క్రికెట్‌లో 5వ హాఫ్ సెంచరీ సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించడం విశేషం.
Also Read : Women World Cup 2022: మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్న జోడి..!