Home » త్రిష ప్రియుడితో డేటింగ్ లో ఉన్నా : బిందు మాధవి

త్రిష ప్రియుడితో డేటింగ్ లో ఉన్నా : బిందు మాధవి

by Bunty
Ad

బిందు మాధవి గురించి తెలియని వారుండరు.  తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించిన బిందు మాధవి టాలీవుడ్ లో మాత్రం పెద్దగా పాపులర్ కాలేక పోయింది. ఆడపా దడపా సినిమాలు చేసి మన హీరోయిన్ అనిపించుకుంది అంతే. ఇక ఆ పాపులారిటీతోనే తెలుగులో బిగ్ బాస్ షోలోకి ఎంటర్ అయింది. తెలుగు బిగ్ బాస్ ఓటిటి విన్నర్ ట్రోఫీని అందుకుంది బిందు మాధవి. గతంలో తమిళ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన బిందు అక్కడ ఫైనల్స్ కు కూడా చేరుకోలేకపోయింది.

Read Also : Pushpa 2 : పుష్ప-2లో మెగా డాటర్‌.. సుకుమార్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా..!

Advertisement

కానీ తెలుగు బిగ్ బాస్ లో మాత్రం అభిమానుల ప్రేమను సాధించగలిగింది. ట్రోఫీ అందుకుంది. అంతేకాదు బిగ్ బాస్ హిస్టరీ లోనే ట్రోపీ అందుకున్న ఫస్ట్ లేడీ కంటెస్టెంట్ గా పేరు సాధించింది బిందు మాధవి. వరుస వెబ్ సిరీస్ లతో సత్తా చూపిస్తున్న ఈ మదనపల్లి బ్యూటీ… తాజాగా ‘న్యూసెన్స్’ అనే చిత్రంలో నటించింది. మే 12 ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో విడుదలైన ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా శనివారం నాడు హైదరాబాదులో మీడియా సమావేశం నిర్వహించారు.

read also : ‘ఏజెంట్’ నిర్మాతలకు భారీ నష్టాలు… రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసిన అఖిల్!

Bindu Madhavi Dating Trisha's Ex Boyfriend?

ఈ ప్రెస్ మీట్ లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. హీరోయిన్ బిందు మాధవిపై వచ్చిన ఒకే ఒక రూమర్ పై యాంకర్ ఓ ప్రశ్న అడిగింది. త్రిష బాయ్ ఫ్రెండ్ తో మీరు డేటింగ్ లో ఉన్నారని రూమర్ వచ్చింది. అది నిజమా కాదా అని యాంకర్ అడగటంతో… దాటవేత ధోరణిలో కాకుండా చాలా సూటిగా ఆన్సర్ ఇచ్చింది బిందు మాధవి. అవును నిజమే. కానీ వేర్వేరు సందర్భాల్లో అది జరిగింది. ఒకే టైంలో ఇద్దరం చేయలేదు. త్రిషతో బ్రేకప్ అయిన తర్వాత నాతో డేట్ నిజాన్ని ఒప్పుకోవాలి తప్పదు… అంటూ నిర్మోహమాటంగా చెప్పేసింది బిందుమాధవి.

READ ALSO : X, Y, Z, Z+ కేటగిరి భద్రత అంటే ఏంటి? ఎవరికి ఈ భద్రత కల్పిస్తారు.

Visitors Are Also Reading