Bimbisara Movie Review: నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన తాజా సినిమా బింబిసార. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ఈ సినిమా భారీ స్థాయిలో నిర్మించబడింది. 500 సంవత్సరాల క్రితం జరిగిన నిజమైన కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. టైం ట్రావెల్ పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఇక ఈ సినిమాకు మల్లిడి వశిష్ట దశకత్వం వహించారు. అంతేకాకుండా కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. సినిమాలో కళ్యాణ్ రామ్ కి జోడిగా కేతరిన్ తెరిసా, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు. సినిమా టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు చూద్దాం.
Also Read: పుష్ప-2లో నటించనున్న సమంత.. ఆమె పాత్ర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Advertisement
Bimbisara Movie Review & Rating :
కళ్యాణ్ రామ్ “బింబిసార” రివ్యూ…!
కథ & కథనం :
Advertisement
సినిమాలో క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల క్రితం త్రిగర్తల సామ్రాజ్య అధినేత బిందుసారుడి పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించాడు. కళ్యాణ్ రామ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమాలో ఫస్ట్ అఫ్ కాస్త స్లోగా అనిపించినా గ్రాఫిక్స్ మాత్రం అద్భుతంగా కనిపించింది. సినిమా కథ మొత్తం బింబిసారుడి కాలం నుండి కలియుగంలోకి వచ్చి సంపాదించిన నిధిని ఎలా కాపాడుకుంటాడు అనేదాని చుట్టు తిరుగుతుంది.
Kalyan ram Bimbisara Movie Review & Rating
సినిమాలో ఫస్ట్ అఫ్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఇంటర్వెల్ అదిరిపోయింది.. సెకండాఫ్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యంగా సినిమాలో గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. నూతన దర్శకుడు అయినప్పటికీ వశిష్ట తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. ఈ సినిమా నందమూరి అభిమానులకు విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి.
Also Read: భర్తల వద్ద భార్యలు రహస్యం గా ఉంచే నాలుగు విషయాలు ఇవేనట..!