Home » టీ20 జట్టులోకి తీసుకోకపోవడంపై ధావన్ కామెంట్స్..!

టీ20 జట్టులోకి తీసుకోకపోవడంపై ధావన్ కామెంట్స్..!

by Azhar
Ad

భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఒక్కపుడు భారత జట్టుకు మూడు ఫార్మట్స్ లో ఇన్నింగ్స్ ను ఆరంభించేవాడు. కానీ ఆ తర్వాత టెస్టులో స్థానం అనేది కోల్పోయాడు. ఇక ఆ తర్వాత ఐపీఎల్ లో బాగా రాణిస్తూ యావ ఆటగాళ్లు టీ20 జట్టులోకి వస్తుండటం.. ఇక్కడ కూడా శిఖర్ స్థానానికి ఎసరు అనేది పెట్టింది. ఓపెనింగ్ కు పోటీ అనేది పెరగడంతో ధావన్ టీ20 లో కనిపించకుండా పోయాడు.

Advertisement

ఇక ఇప్పుడు ఇదే విషయంపై ధావన్ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఓ నేషనల్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధావన్ మాట్లాడుతూ… నిజం చెప్పాలి అంటే నన్ను టీ20 జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకు తెలియదు. కానీ వారికి ఏదైనా ప్లాన్ అనేది ఉంది ఉంటుంది. అయిన నేను దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. అదే విశయం ఆలోచిస్తూ కూర్చోవడం నాకు నచ్చదు అని ధావన్ పేర్కొన్నాడు.

Advertisement

అయితే తన దృష్టి మొత్తం ఇప్పుడు వచ్చిన అవకాశాలను వాడుకోవడమే అని కూడా ధావన్ అన్నాడు. నేను ఇప్పుడు ఆడుతున్న వన్డేలను చాలా ఇషపడుతున్నాను. ఈ వన్డేలనే కాకుండా.. నాకు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ అది ఐపీఎల్ గాని… దేశవాళీ టోర్నీలు గాని అందులో బాగా రాణించాలని అనుకుంటున్నాను అని ధావన్ పేర్కొన్నాడు. అయితే ఇప్పుడు ధావన్ భారత బి జట్టుకు వన్డేలలో కెప్టెన్ గా ఉన్నాడు. ఈ మధ్యే కెప్టెన్ గా విండీస్ పర్యటనను విజయవంతం చేసిన ధావన్… ఇప్పుడు జింబాంబ్వే టూర్ కి సిద్ధమవుతున్నాడు.

ఇవి కూడా చదవండి :

తప్పు చేసి సమర్ధించుకుంటున్న ఆస్ట్రేలియా..!

కామన్వెల్త్ లో మెడల్స్ సాధించిన క్రికెటర్ల భార్యలు వీళ్ళే..!

Visitors Are Also Reading