నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఊర మాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు బాలయ్య కెరీర్ లోనే ఇది ఆల్ టైమ్ హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ అని చెప్పాలి. ప్రీ సేల్స్ ద్వారానే ఎక్సలెంట్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా రాయలసీమలో ఊహకందని ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. ఇది ఒక్కరోజే 54 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది ఈ సినిమా.
READ ALSO : శ్రీనివాస్ రెడ్డిని నమ్మించి, దారుణంగా మోసం చేసిన రాకెట్ రాఘవ !
Advertisement
ఇది ఇలా ఉండగా, వీరసింహారెడ్డి సినిమా స్క్రీన్ ప్లే విషయంలో గోపీచంద్ మలినేని చేసిన పొరపాట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఫస్ట్ హాఫ్ లో వీర సింహారెడ్డి పాత్ర గూస్ బంప్స్ సీన్లు అన్నీ ఉండటం సినిమాకు ఒక విధంగా ప్లస్ అయితే మరో విధంగా మైనస్ అయింది. సింహ, లెజెండ్, అఖండ సినిమాల తరహాలో వీరసింహారెడ్డి స్క్రీన్ ప్లేను ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ తరహా గూస్ బంప్స్ సీన్లు సెకండ్ హాఫ్ లో లేవు. సెకండ్ హాఫ్ కొంతమంది ప్రేక్షకులకు కనెక్ట్ అయితే, మరికొందరికి కనెక్ట్ కాలేదు.
Advertisement
సినిమాలో దాదాపుగా 20 నిమిషాల సన్నివేశాలను కట్ చేసి ఉంటే సినిమా పర్ఫెక్ట్ గా ఉండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. మోతాదుకు మించి సినిమాలో ఫైట్లు ఉన్నాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఆసక్తికరంగా లేని ఫ్లాష్ బ్యాక్, రివర్స్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకు మైనస్ అయింది. ఇంటర్వెల్ సీన్ అదిరిపోయింది అని, అయితే వీరసింహారెడ్డి, భానుమతి పాత్రల మధ్య బాండింగ్ సీన్లు మరి ఆకట్టుకునే స్థాయిలో లేవని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్యకు వీరాభిమాని అయిన గోపీచంద్ మలినేని బాలయ్య గత సినిమాల పోలికలు లేకుండా ఈ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదని సినీ విశ్లేషకులు అంటున్నారు.
READ ALSO : ఓ కుక్కను రూ.20 కోట్లు పెట్టి కొన్న హైదరాబాద్ నివాసి.. దాని ప్రత్యేకతలు ఇవే