Home » శ్రీనివాస్ రెడ్డిని నమ్మించి, దారుణంగా మోసం చేసిన రాకెట్ రాఘవ !

శ్రీనివాస్ రెడ్డిని నమ్మించి, దారుణంగా మోసం చేసిన రాకెట్ రాఘవ !

by Bunty
Ad

జబర్దస్త్ అనే కార్యక్రమం ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అలాగే అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి పేరు అనేది తీసుకువచ్చింది. ఇక అందులో రాకెట్ రాఘవ ఉంటాడు. ఎప్పుడో 2001లో ఇండస్ట్రీలోకి వచ్చిన రాకెట్ రాఘవ సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వస్తున్న తరుణంలో ఆయనకు 2013లో ఈ జబర్దస్త్ లో అవకాశం వచ్చింది. అయితే ఈ షోలో ఈయనకు అంటూ మంచి పేరు అనేది ఉంది. అయితే తాజాగా, శ్రీనివాస్ రెడ్డిని మోసం చేసి, నా జీవితంలో చెరుపుకోలేని తప్పు చేశానని, రాకెట్ రాఘవ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివాదం గురించి తెలుసుకుందాం.

Advertisement

ఈ వివాదం పై రాకెట్ రాఘవ మాట్లాడుతూ, జెమినీ టీవీలో నవ్వుల సవాల్ అనే ప్రోగ్రామ్ వచ్చేది. ఆ ప్రోగ్రాంకి శ్రీనివాస్ రెడ్డి యాంకర్ గా వ్యవహరించేవారు. ఇక ఈ కార్యక్రమం డైరెక్టర్ నా పక్క రూమ్ లోనే ఉండేవారు. ఒకరోజు రాఘవ ఈ కార్యక్రమాన్ని చేస్తావా అని అడిగారు. అయితే నేను ముందు వెనక ఆలోచించకుండా చేస్తానని చెప్పి ఒక రోజు షూటింగ్ పూర్తి చేశాను. ఆ సమయంలో శ్రీనివాస్ రెడ్డి కారు దిగి అక్కడికి వచ్చి ఇది చూసి వెళ్ళిపోయారు. తర్వాత శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రోగ్రాం చేయమని వాళ్లు నిన్ను పిలిచారా అని అడిగారు.

Advertisement

అవునన్నా పిలిస్తేనే వెళ్లాను అని చెప్పాను అని తెలిపాడు రాకెట్ రాఘవ. మరి ఆ విషయం నాకు వాళ్ళు ఎందుకు చెప్పలేదు, కనీసం నువ్వైనా నేను చేస్తున్నాను అని ఒక మాట చెప్పాలి కదా, నాకు ఇవ్వాల్సినవి ఉంటాయి అంటూ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇలా నాకు తెలియకుండానే శ్రీనివాస్ రెడ్డి విషయంలో ఈ కార్యక్రమాన్ని నేను చేసి పెద్ద తప్పు చేశాను. అయితే ఆయన ఈ విషయం గురించి పెద్దగా పట్టించుకోకపోయినా, నాకు మాత్రం అదొక గిల్టీ ఫీలింగ్ మాదిరిగానే ఉంది. ఇప్పటికే ఆయన పేరు గుర్తు వస్తే నా మనసులో ఈ సంఘటన మెదులుతుంది అంటూ శ్రీనివాస్ రెడ్డి విషయంలో జరిగిన సంఘటనను రాకెట్ రాఘవ వెల్లడించారు.

READ ALSO : Dhamaka Movie OTT: రవితేజ ధమాకా ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్‌ ఎందులో అంటే !

Visitors Are Also Reading