Home » ఆ సెంటిమెంట్ వల్ల మహేష్ మూడు సినిమాలు హిట్ కాలేదు..!

ఆ సెంటిమెంట్ వల్ల మహేష్ మూడు సినిమాలు హిట్ కాలేదు..!

by Sravya
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు మహేష్ బాబు తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలోకి వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా సంపాదించుకున్నారు మహేష్ బాబు. దర్శకధీరుడు రాజమౌళితో మహేష్ బాబు ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మీద మహేష్ బాబు ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాజమౌళి సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని ఇప్పటికే ఆడియన్స్ సినిమా ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు కి ప్రేక్షకుల్లో మామూలు క్రేజ్ లేదు.

Advertisement

మహేష్ బాబు సినిమా విడుదల అయితే టాక్ తో సంబంధం లేకుండా ఈజీగా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వస్తాయి. అమ్మ సెంటిమెంట్ వలన మహేష్ బాబు నటించిన మూడు సినిమాలు సక్సెస్ సాధించలేదని ఫాన్స్ అంటున్నారు, అమ్మ సెంటిమెంట్ మహేష్ బాబుకి అచ్చురాదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు అలా అమ్మ సెంటిమెంట్తో మహేష్ బాబు నటించిన మూవీస్ మహేష్ బాబుకి కలిసి రాలేదట ఇక అలా కలిసి రాని సినిమాలు ఏంటో చూసేద్దాం.. మహేష్ బాబు కెరియర్ లో అమ్మ సెంటిమెంట్తో వచ్చిన నిజం సినిమా సక్సెస్ కాలేదు ఈ సినిమాలో భర్త మరణించడంతో భార్య కొడుకుకి ట్రైనింగ్ ఇచ్చే తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని చూస్తుంది. నిజం సినిమా బానే ఉన్న చిన్న చిన్న తప్పులు వలన బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఈ సినిమా సక్సెస్ కాలేదు. అర్పి పట్నాయక్ పాటలు కూడా సినిమాకి మైనస్.

Advertisement

తర్వాత వచ్చిన నాని సినిమా కూడా అనుకున్నంతగా సక్సెస్ కాలేక పోయింది ఎస్ జె సూర్య డైరెక్షన్ లో అమీషా పటేల్ హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ని అందుకోలేకపోయింది. అలానే తాజాగా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా కూడా అమ్మ సెంటిమెంట్తో వచ్చింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితం ని అందుకోలేదు. సంక్రాంతికి రిలీజ్ కావడంతో భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చిన మహేష్ బాబు అభిమానుల్లో కూడా నిరాశ కనపడింది. అమ్మ సెంటిమెంట్ మహేష్ బాబుకి అచ్చిరాదని అంతా కామెంట్లు చేస్తున్నారు ఇటువంటి కాన్సెప్ట్లకు మహేష్ బాబు దూరంగా ఉంటే మంచిదని అంటున్నారు మహేష్ బాబు కథల ఎంపికలో మరింత వైవిధ్యం చూపించాలని అభిమానులు అంటున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading