Home » 15 వారాలు ఇంట్లో ఉన్నా కీర్తికి వచ్చింది అంతేనా…అన్ని లక్షలు మిస్ చేసుకుందిగా…!

15 వారాలు ఇంట్లో ఉన్నా కీర్తికి వచ్చింది అంతేనా…అన్ని లక్షలు మిస్ చేసుకుందిగా…!

by AJAY
Ad

బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే ఎంతో ఘనంగా జరిగింది. ఈ సీజన్ కు మాస్ మహారాజ్ రవితేజ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అంతేకాకుండా ముందు నుండి చివరి వరకు బిగ్ బాస్ ఫినాలే ఎంతో ఆసక్తిగా టెన్షన్ తో సాగింది. విన్నర్ ఎవరు అవుతారు …ట్రోఫీని ఎవరు గెలుస్తారు అని ఉత్కంఠ చివరివరకు ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ సీజన్ లో బిగ్ బాస్ ట్రోపిని సింగర్ రేవంత్ గెలుచుకున్నాడు. షో ప్రారంభంలోనే రేవంత్ విన్నర్ అవుతారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

Advertisement

దానికి కారణం ఈ సీజన్ లో పాపులారిటీ ఉన్న ఒకే ఒక్కడు రేవంత్ ….అయితే చివరికి అంచనాలు కాస్త అటు ఇటుగా మారాయి. రేవంత్ లేదా శ్రీహాన్ ఇద్దరిలో ఒకరు విన్నర్ అవుతారని అంచనా వేశారు. ఇక ఓట్ల పరంగా శ్రీహన్ గెలిచినా….అతడు పప్పులో కాలేయడం తో రేవంత్ టైటిల్ ను గెలిచాడు. అంతే కాకుండా ఈ సీజన్ లో కీర్తి టాప్ 3 లో నిలిచింది. మొదటి నుండి కీర్తికి చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు.

Advertisement

ఓ యాక్సిడెంట్ లో కుటుంబాన్ని కోల్పోయినా ధైర్యాన్ని కోల్పోకుండా కీర్తి ఇంత దూరం రావడాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నారు. ఇక ఫినాలే తరవాత ఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు అన్నది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలోనే కీర్తి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

ఫినాలే లో 30 లక్షల ఆఫర్ ను కీర్తి పక్కన పెట్టింది. కాగా మొత్తం 15 వారాలకు గానూ కీర్తికి నిర్వాహకులు రూ.8 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రెమ్యూనరేషన్ తక్కువే అయినా కీర్తి మాత్రం ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. బిగ్ బాస్ తో వచ్చిన పాపులారిటీ తో సీరియల్స్ మరియు సినిమా ఆఫర్ లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Visitors Are Also Reading