Home » బిగ్ బాస్ లో ఊహించని ట్విస్ట్…యాంకర్ రవి రీఎంట్రీ…?

బిగ్ బాస్ లో ఊహించని ట్విస్ట్…యాంకర్ రవి రీఎంట్రీ…?

by AJAY
Ad

బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. ముగింపు దశకు చేరుకోవడంతో హౌస్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అంతే కాకుండా టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటున్నారు. అన్న చర్చ బయట జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఊహించని ట్విస్ట్ మరొకటి జరగబోతున్నట్టు సమాచారం అందుతోంది. బిగ్ బాస్ నుండి యాంకర్ రవి గత వారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే యాంకర్ రవి ని బిగ్ బాస్ యాజమాన్యం కావాలని ఎలిమినేట్ చేసిందని అతడికి ఫుల్ సపోర్ట్ ఉందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Anchor ravi

Anchor ravi

ఎంతో ఫాలోయింగ్ ఉన్న రవిని ఎలిమినేట్ ఎలా చేస్తారంటూ… రవి ఎలిమినేషన్ ను ఖండిస్తున్నారు. ఇక అభిమానులతోపాటు తెలంగాణ జాగృతి సైతం రవి ఎలిమినేషన్ ను తీవ్రంగా ఖండించింది. అంతేకాకుండా తెలంగాణ జాగృతి కార్యకర్తలు అన్నపూర్ణ స్టూడియో వద్ద నిరసనకు దిగారు.

Advertisement

Advertisement

రవి ఎలిమినేషన్ ను ప్రతి ఒక్కరూ ఖండిస్తూ ఉండటంతో బిగ్ బాస్ యాజమాన్యం దిగివచ్చినట్టు తెలుస్తోంది. దాంతో తిరిగి రవిని హౌస్ లోకి పంపించాలనే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నట్టు సమాచారం అందుతోంది.

గతంలో యాంకర్ శ్యామల ను ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇప్పించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అలీ రెజా ను సైతం అదేవిధంగా రీఎంట్రీ ఇప్పించారు. దాంతో ఇప్పుడు రవి రీ ఎంట్రీ పై వస్తున్న వార్తలు కూడా నిజమే అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే గత సీజన్లలో రీ ఎంట్రీ ఇచ్చిన యాంకర్ శ్యామల, అలి రెజా కూడా బిగ్ బాస్ విన్నర్ లు కాలేకపోయారు. మరి అవి అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి.

Visitors Are Also Reading