Home » కొంచెం కామిడీగా మ‌రికొంచెం సీరియ‌స్‌గా…

కొంచెం కామిడీగా మ‌రికొంచెం సీరియ‌స్‌గా…

by Bunty

బిగ్‌బాస్ 5 వ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 91 ఎపిసోడ్‌కి చేరుకుంది. శ‌నివారం రోజున జ‌రిగిన ఎపిసోడ్ మొత్తం కామెడీగా సాగింది. నాగార్జున కొన్ని కామెడీ ప‌రీక్ష‌లు పెట్టి వారి నుంచి కామెడీ రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేయ‌డంతో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగింది. వారం మొత్తం చ‌ప్ప‌గా సాగిన ఎపిసోడ్ చివ‌ర్లో ఆద్యంతం న‌వ్వులు పూయించ‌డంతో హ్యాపీగా ఎండింగ్ అయింది.

నాగార్జున వివిధ ర‌కాల టాస్క్‌లు ఇవ్వ‌డంతో వాటిని బిగ్ బాస్ కుటుంబ స‌భ్యులు కామెడీ యాంగిల్ లో ఫినీష్ చేసి మెప్పించారు. కుటుంబ స‌భ్యుల మ‌ధ్య గ‌త టాస్క్‌ల‌కు సంబంధించిన డిస్క‌ష‌న్‌, ఫ్యాష‌న్ క్యాట్ వాక్ ఇలా ఆస‌క్తిక‌ర‌మైన టాస్క్‌లు ఇచ్చారు. ఈ టాస్క్‌ల‌ను కుటుంబ స‌భ్యులు పూర్తి చేసి ఆక‌ట్టుకున్నారు. ఫ్యాష‌న్ క్యాట్‌వాక్‌లో ష‌ణ్ముఖ్ విన్న‌ర్‌గా, కాజ‌ల్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. ఆ త‌రువాత ఇచ్చిన వాహ్ తాజ్ టీ టాస్క్ లో షోద్వారా నేర్చుకున్న విష‌యాల‌ను కుటుంబ స‌భ్యులు బ‌య‌ట‌పెట్టారు. ప‌లు ఫీలింగ్స్‌తో కూడిన ఎమోజీల‌ను ఉంచి అవి ఎవ‌రికి వ‌ర్తిస్తాయో చెప్పాల‌ని కోరారు. ఈ టాస్క్‌కూడా ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగింది. ఎవ‌రిపై ఎలాంటి కోపం ఉన్న‌దో ఈ టాస్క్ లో బ‌య‌ట‌డింది. హౌస్ లో ఉండేందుకు ఎవ‌రు అర్హులు అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో సిరి గెల‌వ‌గా, పింకీ ఓడిపోయింది. ఇక నామినేష‌న్ల‌లో ఉన్న వారిలో ఎవ‌రు సేఫ్ అవుతారు ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు అన్న‌ది ఈరోజు తేలిపోతుంది.

Visitors Are Also Reading