Home » బిగ్ బాస్ స‌న్నీకి బంప‌రాఫ‌ర్… అమెరికా సంబంధం..100కోట్ల క‌ట్నం కూడా..!

బిగ్ బాస్ స‌న్నీకి బంప‌రాఫ‌ర్… అమెరికా సంబంధం..100కోట్ల క‌ట్నం కూడా..!

by AJAY
Ad

బిగ్ బాస్ లో టైటిల్ గెలిచిన వాళ్ల‌కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. హౌస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర‌వాత కొన్ని రోజుల పాటూ ఫుల్ బిజీగా ఉంటారు. వ‌రుస ఇంట‌ర్య్వూల‌కు వెళుతూ ఆస‌క్తిక‌ర విష‌యాలు చెబుతుంటారు. ఇక తెలుగు బిగ్ బాస్ ను కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగువారు సైతం చూస్తూ ఉంటారు. ఇక రీసెంట్ గా బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 లో స‌న్నీ విజేత‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. వీజేగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న స‌న్నీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి త‌న ఎంట‌ర్టైన్మెంట్ తో ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు.

Advertisement

illness for bigg boss sunny

illness for bigg boss sunny

అలా ఏకంగా బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాడు. ఇక స‌న్నీకి బిగ్ బాస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర‌వాత ఎంతో మంది క‌లిసి అభినంద‌న‌లు తెల‌పగా మ‌రికొంద‌రు ఫోన్ లు చేసి శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. అయితే తాజాగా ఓ మ‌హిళ విదేశాల నుండి ఫోన్ చేసి త‌మ కూతురిని పెళ్లి చేసుకుంటావా అని అడిగింద‌ట‌. అంతే కాకుండా వంద కోట్ల ఆస్తులు ఉన్నాయ‌ని ఒకే కూతురు ఉంద‌ని ఆ ఆస్తి మొత్తం ఇచ్చేస్తామ‌ని చెప్పింద‌ట‌. త‌మ‌కు ఒకే కూతురు అని ఈ యేడాది ఇండియాకు వ‌స్తుందని..వెళ్లి కలిసి ఆ త‌ర‌వాత న‌చ్చితే పెళ్లి చేసుకోవాల‌ని కోరింద‌ట‌.

Advertisement

అంతే కాకుండా త‌మ కూతురు ఎంతో అందంగా ఉంటుందని ఆమెను చూస్తే నువ్వే ఎదురుక‌ట్నం ఇస్తావంటూ స‌న్నీకి చెప్పింద‌ట‌. తాను సీరియస్ గా అడుగుతున్నాన‌ని నచ్చితే పెళ్లి చేస్తాన‌ని చెప్పింద‌ట‌. కానీ స‌న్నీ సున్నితంగా నో చెప్పాడ‌ట‌. చేసుకుంటావా అని అడిగారు అది చాలు…న‌న్ను భ‌రించ‌డం చాలా క‌ష్టం అంటూ చెప్పాడ‌ట‌. ఇక బిగ్ బాస్ నుండి వ‌చ్చాక‌ వంద కోట్ల క‌ట్నం ఇస్తామ‌ని అన్నారంటే స‌న్నీ క్రేజ్ ఎలా పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

Visitors Are Also Reading