బిగ్ బాస్ సీజన్ 5 నిన్నటితో పూర్తయింది. ఈ సీజన్ లో వీజే సన్నీ విన్నర్ గా నిలవగా షణ్ముఖ్ జస్వంత్ రన్నరప్ గా నిలిచారు. తెలుగులో బిగ్ బాస్ సీజన్ వన్ నుండి విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ప్రతి సీజన్ కూడా సూపర్ హిట్ గా నిలుస్తోంది. ఇక సక్సెస్ ఫుల్ గా 5 సీజన్లు పూర్తి చేసుకున్నప్పటికీ ఫాలోయింగ్ ఈ మాత్రం తగ్గలేదు. దాంతో బిగ్ బాస్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభించే ఆలోచనలో బిగ్ బాస్ యాజమాన్యం ఉన్నట్టు తెలుస్తోంది.
అంతే కాకుండా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే… బిగ్ బాస్ సీజన్ 6 ను ఓటీటీ వేధికగా ప్రసారం చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే హిందీ బిగ్ బాస్ ను ఓటీటీ లో ప్రసారం చేస్తున్నారు. అక్కడ ఓటీటీ బిగ్ బాస్ కు అనుకున్నట్టుగానే ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలోనే తెలుగు బిగ్ బాస్ ను కూడా ఓటీటీ వేదికగా ప్రసారం చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా రెండు నెలల్లోనే ఓటీటీ బిగ్ బాస్ ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఈ వార్తలకు బలం చేకూరేలా బిగ్ బాస్ సీజన్ 5 చివరి ఎపిసోడ్ లో నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Advertisement
also read : వీక్ క్లైమాక్స్ వల్ల బాక్స్ ఆఫీస్ బోల్తా పడిన సినిమాలు ఇవే…!
త్వరలోనే కలుసుకుందాం…. అంటూ సీజన్ 5 కి నాగార్జున ముగింపు పలికారు. దాంతో సీజన్ 6 కూడా త్వరలోనే రాబోతుందని అర్థమవుతోంది. మరి బిగ్ బాస్ సీజన్ 6 లో ఎవరెవరు హౌస్ లోకి అడుగు పెడతారు అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే మనదేశంలో బిగ్ బాస్ మొదట హిందీ లో ప్రారంభం అయింది. అక్కడ ఏకంగా 13 సీజన్లు పూర్తి చేసుకుంది. అంతేకాకుండా 13 సీజన్లకు కూడా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా చేశారు. హిందీలో వచ్చిన క్రేజ్ కారణంగానే ఇతర భాషల్లోనూ బిగ్ బాస్ ను ప్రారంభించారు.