Home » బిగ్ బాస్ నుండి యానీ మాస్ట‌ర్ ఔట్….!

బిగ్ బాస్ నుండి యానీ మాస్ట‌ర్ ఔట్….!

by AJAY
Ad

బిగ్ బాస్ సీజ‌న్ 5 లోకి ఎంట్రీ ఇచ్చిన యానీమాస్ట‌ర్ హౌజ్ లో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఇప్ప‌టివ‌ర‌కూ ఎలిమినేష‌న్స్ ను దాటేసింది. అయితే గ‌త వారం రోజుల నుండి యానీ మాస్ట‌ర్ కు భ‌య‌ట నెగిటివిటీ పెరిగిపోయింది. ముఖ్యంగా సన్నీతో గొడ‌వ‌ల వ‌ల్లే యానీ మాస్ట‌ర్ కు నెగిటివిటీ పెరిగిన‌ట్టు క‌నిపిస్తోంది. దానికి కార‌ణం స‌న్నీకి అభిమానులు పెర‌గ‌టమే. బిగ్ బాస్ లో సాధార‌ణంగా ఒక‌రికి విప‌రీత‌మైన క్రేజ్ వ‌స్తే వారితో గొడ‌వ‌ప‌డిన వాళ్లు ఎప్పుడు ఎలిమినేష‌న్ లోకి వ‌స్తారా అని అభిమానులు ఎదురుచూస్తుంటారు.

Advertisement

ఎలిమినేష‌న్ లోకి రాగానే త‌మ‌కు కావాల్సిన వాళ్ల‌ను స‌పోర్ట్ చేసి న‌చ్చ‌ని కంటెస్టెంట్ పై కోపాన్ని ఓట్ల రూపంలో చూపిస్తారు. ఇక ఈసారి కూడా అదే విధంగా జ‌రిగిన‌ట్టు క‌నిపిస్తోంది. ఈ వారం యానీ మాస్ట‌ర్ ఎలిమినేష‌న్ లోకి రావాల‌ని స‌న్నీ అభిమానులు ఎంత‌గానో కోరుకున్నారు. వాళ్లు అనుకున్న‌ట్టుగానే యానీ మాస్ట‌ర్ ఎలిమినేష‌న్స్ లో నిలిచింది. దాంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆవిడేన‌ని సోమ‌వారం నుండి ప్ర‌చారం మొద‌లెట్టారు.

Advertisement

ఇక ఇప్పుడు వారు కోరుకున్న‌ట్టుగానే జ‌రిగిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ వారం హౌస్ నుండి బ‌య‌ట‌కు వెళ్లేది యానీ మాస్ట‌రే అని లీకు రాయుళ్లు లీక్ చేశారు. దాంతో సోష‌ల్ మీడియాలో యానీ ఎలిమినేట్ అయిన‌ట్టు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పటి వ‌ర‌కూ లీకు రాయుళ్లు చేసిన లీకుల‌న్నీ నిజ‌మ‌య్యాయి. ప్ర‌తి వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతున్నారో ముందు రోజే లీక్ అవ్వ‌డం అనుకున్న‌ట్టుగానే జ‌ర‌గ‌టం చూస్తూనే ఉన్నాం.

అంతే కాకుండా యానీ మాస్ట‌ర్ పై సోషల్ మీడియాలో వ‌స్తు్న్న కామెంట్లు చూస్తుంటే దాదాపు ఆమె ఎలిమినేషన్ కన్ఫామ్ అయిన‌ట్టే క‌నిపిస్తోంది. ఇక‌ యానీ మాస్ట‌ర్ ఈ వారం ఎలిమినేట్ అవ్వ‌డంతో ఇప్పుడు హౌస్ లో ఎనిమిది మంది మాత్ర‌మే ఉంటారు. పంతొమ్మిది మందితో బిగ్ బాస్ సీజ‌న్ 5 షురూ కాగా తొమ్మిదో కంటెస్టెంట్ గా యానీ మాస్ట‌ర్ ఎలిమినేట్ అయ్యారు. ఇక వ‌రుస‌గా బిగ్ బాస్ హౌస్ నుండి స‌ర‌యు, ఉమాదేవి, లహరి షారి, నటరాజ్‌ మాస్టర్‌, హమీదా, శ్వేత, ప్రియ, లోబో, విశ్వ, జెస్సీలు ఎలిమినేట్ అయ్యారు.

Visitors Are Also Reading