Home » Bigg boss season-5 : బిగ్ బాస్ నుండి కాజల్ ఔట్…!

Bigg boss season-5 : బిగ్ బాస్ నుండి కాజల్ ఔట్…!

by AJAY

బిగ్ బాస్ ఎలిమినేషన్ పై ప్రతివారం లీక్ అయినట్లుగానే ఈ వారం కూడా ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది లీకు రాయుళ్లు బయటపెట్టేసారు. అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ ఎలిమినేషన్ లు వేరు….ఈ వారం ఎలిమినేషన్ వేరు. ఇన్ని వారాలు హౌస్ లో ఉండి ఫైనల్ వీక్ కావడం మామూలు విషయం కాదు. ఇక ఈ వారం కాజల్ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. నిజానికి గత వారం కూడా కాజల్ ఎలిమినేట్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ అనుకోకుండా కాజల్ ప్లేస్ లో ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయింది. సింగర్ శ్రీరామ్ ఫినాలేకు చేరుకోవడం తో 14వ వారం ఎలిమినేషన్ లో సిరి, షణ్ముక్, కాజల్, మానస్, సన్నీలు ఉన్నారు. అయితే వీరిలో షణ్ముఖ్ ఈ వారం ఎలిమినేట్ అవుతారని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

Kajal out from bigg Boss

Kajal out from bigg Boss

కానీ షన్నుకు ముందు నుండి ఉన్న ఫాలోయింగ్ వల్ల ఆ వార్తలన్నీ ఉత్తుత్తి వార్తలే నని ముందే తేలిపోయింది. కానీ ఈవారం సిరి మరియు కాజల్ కు ఓట్లు తక్కువ పడ్డాయి. వారిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా ఇప్పుడు హౌస్ నుండి కాజల్ ఎలిమినేట్ అయింది. దాంతో మిగతా నలుగురు సభ్యులు ఫైనల్ కు చేరుకున్నారు. అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న ఫాలోయింగ్ చూస్తే సన్నీ లేదంటే షణ్ముక్ బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ గెలుస్తారని అర్థం అవుతోంది. మరి ఫైనల్ ఎవరు గెలుస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Visitors Are Also Reading