బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతవారం బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రారంభమైంది. బిగ్ బాస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ప్రారంభమైన వారం రోజుల్లోనే ప్రేమ జంట తయారయ్యింది. ప్రతి ఒక్క సీజన్ లో ఇలాంటివి చాలా కామన్. కానీ ఈ సీజన్లో మాత్రం వారం రోజుల్లోనే ప్రేమించుకోవడం చాలా విశేషంగా ఉంది. అది ఎవరో కాదు పల్లవి ప్రశాంత్, రతిక. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
హౌస్ లో కూడా ఉన్న వారంతా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కన్ఫామ్ చేసేసారు. రతిక ఇప్పటికే లవ్ ఫెయిల్యూర్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. హౌస్ లోకి వచ్చిన తర్వాత తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గుర్తుకు వస్తున్నాడని బాధపడిన విషయం తెలిసిందే. ఓవైపు తన గురించి ఆలోచిస్తూనే మరోవైపు పల్లవి ప్రశాంత్ తో ప్రేమలో పడింది ఈ భామ. హౌస్ లో అందరూ ఒకవైపు ఉంటే వీరిద్దరూ మాత్రమే మరొకవైపు ఉంటారు. వీరిద్దరూ కలిసే అన్ని పనులు చేసుకుంటారు. తినడం, కలిసి కూర్చోవడం, పనులు చేసుకోవడం అన్నీ కలిసే చేస్తుంటారు. బిగ్ బాస్ కూడా వీళ్ళ లవ్ ని కన్ఫర్మ్ చేశాడు.
Advertisement
Advertisement
శివాజీ ఆగ్రహంతో ఉన్న సమయంలో బిగ్ బాస్ బిపి చెకప్ మిషన్ ని పంపించి బీపీ చెక్ చేయమని అంటారు. దీంతో శివాజీకి కోపం వస్తుంది. ఇక రితిక బీపీ మిషన్ ను తీసుకొని ప్రశాంత్ బిపిని చెక్ చేస్తుంది. తన గుండెపై సెతస్కోప్ ను పెట్టి వింటూ ఉంటుంది. ఇంతలో బిగ్ బాస్ రతిక ప్రశాంత్ గుండె ఏం చెబుతుంది అని అడగగా… రతిక రతిక అంటుంది అని కంటెస్టెంట్స్ అందరూ ఎగతాళి చేస్తారు. ఇక రతిక కూడా రతికా రతికా అంటుంది అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే ప్రశాంత్ కన్నా కూడా రతికనే ఎక్కువగా ప్రశాంత్ ను ఇష్టపడుతుంది అనే విషయం మనకు తెలిసిపోతుంది. ఇది నిజంగా ఇష్టంతోనే చేస్తుందా, లేకపోతే ఏదైనా టాస్క్ హ అన్న విషయం తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
అనుష్క ఎంతో అందంగా ఉంటుంది…. రాజమౌళి సంచలన వ్యాఖ్యలు !
కోలీవుడ్ హీరోతో రకుల్ ప్రేమాయణం..ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చాడా..?
నా కొడుకును బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు… విజయ్ తండ్రి బయట పెట్టిన సీక్రెట్..!