ఐటమ్ సాంగ్స్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటి ముమైత్ ఖాన్. ఇప్పట్లో ముమైత్ ఖాన్ ఎంతో బిజీగా ఉండేది. ఐటమ్ పాటలకు డ్యాన్సులు చేయడంతో పాటూ సినిమాలలో కొన్ని ముఖ్యమైన పాత్రలు చేసేది. ఆ తరవాత మెల్లిమెల్లిగా ముమైత్ ఖాన్ కు ఆఫర్లు తగ్గాయి. ఇక బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ లోనే అవకాశం రావడంతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది.
Advertisement
కొన్ని వారాల పాటూ హౌస్ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగింది. ఇక రీసెంట్ గా ముమైత్ ఖాన్ బిగ్ బాస్ తెలుగు ఓటిటిలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి మాత్రం మొదటి వారంలోనే ముమైత్ ఖాన్ బిగ్ బాస్ నుండి అవుట్ అయ్యింది. ఇంటి నుండి బయటకు వచ్చిన తరవాత కూడా తాను ఇంత తొందరగా ఎలిమినేట్ అవుతానని ఊహించలేదని చెప్పింది.
Advertisement
ఇదిలా ఉండగా బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన ముమైత్ ఖాన్ రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ ఓటిటి కోసం ముమైత్ ఖాన్ ఒక్కో వారానికి రూ.80 వేల రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఖచ్చితంగా 80వేలు ఉంటుందని చెప్పలే కానీ లక్ష లోపు ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.