Home » క‌ళ్లు చెదిరే ఇల్లు క‌డుతున్న‌ బిగ్ బాస్ బ్యూటీ…ఇంట్లోనే థియేట‌ర్ తో పాటూ మ‌రెన్నో..!

క‌ళ్లు చెదిరే ఇల్లు క‌డుతున్న‌ బిగ్ బాస్ బ్యూటీ…ఇంట్లోనే థియేట‌ర్ తో పాటూ మ‌రెన్నో..!

by AJAY
Ad

బిగ్ బాస్ కు ముందు కొంత‌మంది సెలబ్రెటీల‌కు పెద్ద‌గా పాపులారిటీ లేకపోయినా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర‌వాత ఫుల్ బిజీ అయిపోతారు. అలా చాలా మంది బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఇప్పుడు అవ‌కాశాల‌తో బిజీగా ఉన్నారు. వారిలో హిమ‌జ కూడా ఒక‌రు. బిగ్ బాస్ హౌస్ లో త‌న నిజాయితీతో హిమ‌జ ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. ఇక హౌస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర‌వాత సినిమాల‌తో పాటూ టీవీ షోలు చేస్తూ చేతి నిండా సంపాదిస్తోంది.

bigg boss himaja new hose

Advertisement

అయితే గ‌తంలో హిమ‌జ ఓ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేశాన‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. త‌న త‌ల్లి స‌హాయంతో అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేశాన‌ని త్వ‌ర‌లోనే ఓ సొంత ఇంటిని నిర్మించుకుంటాన‌ని హిమ‌జ చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆ క‌ల కూడా నెర‌వేర‌బోతోంది. హిమ‌జ ఓ నాలుగు అంత‌స్తుల భ‌వ‌నాన్ని నిర్మించుకుంటోంది. ప్రస్తుతం ఆ ఇల్లు కన్స్ట్రక్ష‌న్ లో ఉంది. దీనికి సంబంధించిన భూమి పూజ వీడియోను హిమ‌జ యూట్యూబ్ లో షేర్ చేసింది.

Advertisement

bigg boss himaja new hose

ప్ర‌స్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. హిమ‌జ త‌న ఇంటికి సంబంధించిన వివ‌రాల‌ను వీడియోలో రికార్డ్ చేసింది. గ్రౌండ్ ఫ్లోర్ లో త‌న త‌ల్లి దండ్రుల కోసం బెడ్ రూమ్ ను క‌ట్టి ఇస్తున్నాన‌ని హిమ‌జ పేర్కొంది. అంతే కాకుండా ఫస్ట్ ఫ్టోర్ మొత్తం త‌న‌దేన‌ని చెప్పింది. అందులో ఒక మేక‌ప్ రూమ్ కూడా ఉంటుంద‌ని తెలిపింది. అదే విధంగా మూడో అంత‌స్తులో జిమ్ ను ఏర్పాటు చేసుకుంటున్న‌ట్టు పేర్కొంది. ఇక నాలుగ‌వ అంత‌స్థులో థియేట‌ర్ ను ఏర్పాటు చేసుకుంటున్న‌ట్టు తెలిపింది. త‌న ఇంటి నిర్మాణం పూర్త‌య్యే వ‌ర‌కూ ఒక యేడాది ప‌డుతుంద‌ని హిమ‌జ చెప్పుకొచ్చింది.

Visitors Are Also Reading