Home » కాస్ట్లీ కారును కొనుగోలు చేసిన‌ట్టు బిగ్ బాస్ హిమ‌జ..వీడియో వైర‌ల్..!

కాస్ట్లీ కారును కొనుగోలు చేసిన‌ట్టు బిగ్ బాస్ హిమ‌జ..వీడియో వైర‌ల్..!

by AJAY
Ad

బుల్లితెర సెల‌బ్రెటీలు సైతం భారీగా సంపాదిస్తున్నారు. ఖ‌రీదైన ఇల్లు కాస్ట్లీ కార్లు కొనుగోలు చేస్తున్నారు. కోట్ల విలువ చేసే కార్లు కొనుగోలు చేస్తూ నెటిజ‌న్లను అవాక్క‌య్యేలా చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ హిమ‌జ కూడా కొత్త కారును కొనుగోలు చేసా అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో బీఎండ‌బ్ల్యూ కారును చూపిస్తూ నాకు నేను దిపావ‌ళికి ఇచ్చిన గిఫ్ట్ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. ఈ పోస్టు చూసివాళ్లంతా షాక్ అవుతున్నారు.

Advertisement

Advertisement

అప్పుడే హిమ‌జ అంత సంపాదించిందా అని అనుకుంటున్నారు. అయితే వీడియో ఓపెన్ చేస్తే మాత్రం మ‌రో క‌న్ఫ్యూజ‌న్ వ‌స్తోంది. హిమ‌జ ఇన్స్టా గ్రామ్ వీడియోలో త‌న కొత్త కారును చూపిస్తూ అందులో ఎక్కి కూర్చుంది. ఇక కారులో నిద్ర‌పోయిన హిమ‌జ నిద్ర నుండి నుంచి మేలుకున్న‌ట్టు చూపిస్తూ ఇది నిజం కాదు క‌ల అని చూపించిన‌ట్టుగా ఉంది. దాంతో అస‌లు హిమ‌జ కారు కొనిందా లేదంటే జ‌నాల‌ను ఫూల్స్ ను చేస్తుందా అన్నది మాత్రం అర్థం కాక నెటిజ‌న్లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

bigg boss himaja new hose

ఇదిలా ఉంటే కొంత‌మంది బుల్లితెర సెలబ్రెటీలు గ‌తంలో ఇలాంటివి చేసి అడ్డంగా బుక్క‌య్యారు. శివ‌జ్యోతి త‌న పాత కారును వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టి దాన్ని కొత్త కారులా చూపించారు. ఇక హిమ‌జ విష‌యానికి వ‌స్తే బిగ్ బాస్ ద్వారా హిమ‌జ చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. అంతే కాకుండా సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ మ‌రియు ఇత‌ర పాత్ర‌ల‌లో న‌టిస్తూ అభిమానుల‌ను సంపాదించుకున్నారు.

Visitors Are Also Reading