Home » LAMBASINGI MOVIE REVIEW IN TELUGU : బిగ్ బాస్ దివి లంబసింగి మూవీ రివ్యూ.. ఇదో కొత్త ప్రపంచం

LAMBASINGI MOVIE REVIEW IN TELUGU : బిగ్ బాస్ దివి లంబసింగి మూవీ రివ్యూ.. ఇదో కొత్త ప్రపంచం

by Anji
Ad

సాధారణంగా శుక్రవారం వచ్చిందంటే చాలు సినిమాలు విడుదలవుతుంటాయి. ఈ మధ్య కాలంలో ఒకేరోజు ఎక్కువ సినిమాలు పోటాపోటీగా విడుదలవుతున్నాయి. ఈ వారం విడుదలైన సినిమాల్లో ‘లంబసింగి’ ఒకటి. ఈ చిత్రానికి సొగ్గాడే చిన్ని నాయన, రారండోయ్ వేడుక చూద్దాం, బంగార్రాజు చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల సమర్పకులుగా వ్యవహరిస్తూ.. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ‘కాన్సెప్ట్ ఫిల్మ్స్’ బ్యానర్ పై ఆనంద్ తన్నీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.  నవీన్ గాంధీ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.  భరత్‌ రాజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ‘లంబసింగి’ చిత్రం మార్చి 15 న ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ప్రేక్షకులను ఈ మూవీ మెప్పించిందో లేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

కథ మరియు విశ్లేషణ : 

భరత్ రాజ్ (వీరబాబు) కానిస్టేబుల్ గా ఎంపికఅవుతాడు. లంబసింగి అనే గ్రామంలో అతనికి పోస్టింగ్ ఇస్తారు. ఆ ఊరిలో బస్సు దిగగానే హరిత (దివి)ని చూస్తాడు. ఆ తరువాత ఆమె ఓ మాజీ నక్సలైట్ కూతురు అని తెలుస్తోంది. ఆ గ్రామంలో నక్సలైట్లుగా ఉన్న చాలా మందికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది. వారిలో దివి తండ్రి ఒకరు. అలాంటి వారితో పోలీసులు రోజూ సంతకాలు పెట్టించుకొని వాళ్లను గమనిస్తూ ఉండాలి. ఈ పని వీరబాబుకి అప్పగిస్తారు. హరితను ప్రేమలో పడేసేందుకు రోజూ ఆమె తండ్రితో సంతకం పెట్టించేందుకు ఇంటికి వెళ్లి వస్తుంటాడు. హరిత ఆ గ్రామంలోని ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తుంటుంది. ఓరోజు ప్రాణపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాాపాడే క్రమంలో హరితకి మరింత దగ్గర అవుతాడు వీరబాబు. ఓ రోజు హరితకు తన ప్రేమను తెలియపరచగా ఆమె ఒప్పుకోదు. దీంతో నిరాశకు గురైన వీరబాబు.. అతను మాత్రమే పోలీస్ స్టేషన్ లో డ్యూటీలో ఉండగా.. కొందరూ నక్సలైట్లు దాడి చేసి అక్కడ ఉన్న ఆయుధాలను తీసుకెళ్లిపోతారు. ఈ దాడిలో గాయపడిన వీరబాబుకి ఊహించని షాక్ తగులుతుంది. అది ఏంటి..? అసలు హరిత తన ప్రేమను ఎందుకు నిరాకరించింది..? ఆమె గతం ఏంటి..? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాను థియేటర్లలో వీక్షించాల్సిందే.

Advertisement

ఈ సినిమా ఫస్ట్ హాప్ లో కొంచెం స్లో అనిపించినప్పటికీ తరువాత వేగం పెంచి ప్రేక్షకుడికి మాత్రం బోర్ కొట్టకుండా తెరకెక్కించాడు దర్శకుడు నవీన్ గాంధీ. లంబసింగి చిత్రం యొక్క కథ చాలా అద్భుతమనే చెప్పాలి. హీరోయిన్ ట్రాక్ ని దర్శకుడు డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ వద్ద వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సెకండాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ కూడా ప్రేక్షకులు ఆలోచనలో పడే సమయం కూడా ఇవ్వడు. స్క్రీన్ ప్లే ని చాలా పకడ్బందిగా డిజైన్ చేసుకున్నాడు. వీరబాబు, రాజు పాత్రల్లో చేయించిన కామెడీ నవ్విస్తుంది. క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఈ వారం విడుదలైన సినిమాలలో లంబసింగి చిత్రం మంచి వసూళ్లను రాబడుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దర్శకుడు నవీన్ గాంధీ ఎక్కడ బోర్ కొట్టకుండా ఈ సినిమాని తెరకెక్కించాడు.

ఈ చిత్రానికి ఆర్.ఆర్.ధృవన్ అందించిన సంగీతం ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. ఒక్కసారి వినగానే ప్రతీ పాట కూడా మైండ్ లోకి ఎక్కేసేలా ఉంటుంది. తెరపై కూడా వాటిని చాలా అందంగా ప్రెజెంట్ చేశాడు కె బుజ్జి. ఇక ఎడిటర్ విజయ్ వర్దన్ కావూరి తన పనితనంతో ప్రేక్షకులను మెప్పించాడు. నటీనటుల విషయానికొస్తే.. దివి అందంగా కనిపించింది. ఆమెలో సహజమైన నటీ ఉందని అందరికీ తెలిసిపోయింది. హీరో భరత్ కూడా వీరబాబు అనే పాత్రలో చాలా నేచురల్ గా కనిపించాడు. ప్రధానంగా క్లైమాక్స్ లో ఇతని ఎమోషనల్ పెర్పార్మన్స్ తో మంచి మార్కులు వేయించుకుంటాడు. మిగతా నటీ, నటులు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు.  మొత్తానికి ఓ మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు దర్శకుడు నవీన్ గాంధీ.

ప్లస్ పాయింట్స్ :

  • డైరెక్టర్ టేకింగ్
  • సెకండాఫ్
  • సినిమా ట్విస్ట్

మైనస్ పాయింట్స్ : 

  • కొన్ని బోర్ కొట్టించే సీన్లు
  • ఫస్టాప్ స్లోగా సాగడం

రేటింగ్ : 3/5

Also Read :  RAZAKAR MOVIE REVIEW IN TELUGU : రజాకార్ మూవీ రివ్యూ.. తొలి సినిమాతోనే రికార్డులు క్రియేట్ చేశాడా..?

Visitors Are Also Reading