బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. వారం మొత్తం ఎలా ఉన్నా సోమవారం వచ్చిందంటే నామినేషన్స్ తో హౌస్ మొత్తం హీటెక్కిపోతూ ఉంటుంది. ఇక నిన్న అందరూ అనుకున్నట్లుగానే తేజ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఈవారం నామినేషన్స్ చాలా హోరాహోరీగా జరుగుతున్నాయి. సిల్లీ రీజన్స్ నుంచి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే వరకు కంటెస్టెంట్స్ వెళ్లారు. ఇక ఈసారి అందరి టార్గెట్ అశ్విని అయింది. ఈ వారం బిగ్ బాస్ ఇంట్లో ఉన్న అమ్మాయిలను రాజమాతలుగా కూర్చోబెట్టి వారి ముందు నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టాలని చెప్పాడు.
ఇక శోభ, ప్రియాంక, అశ్విని, రతిక ముందు మిగతా కంటెస్టెంట్స్ తమ కారణాలు చెప్పి నామినేట్ చేశారు. ఇక వారి నామినేట్ కరెక్ట్ అయ్యింది అని రాజమాతలకు అనిపిస్తే వారే డైరెక్ట్ గా నామినేట్ చేశారు. ఈ అమర్, భోలేను చేయడం, భోలేను అమర్ నామినేట్ చేయడం జరిగింది. ఇక ఈ ప్రక్రియలో ప్రియాంక, శోభ అశ్వినిపై విరుచుకుపడ్డారు.భోలేకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నావని, ఆయన నామినేట్ అప్పుడే మాట్లాడుతున్నావని శోభ చెప్పడంతో, అశ్విని తాను నోరు ఎత్తితేనే పాపం అయిపోయిందని, అందరు తన మీదనే అరుస్తున్నారని ఏడుపు లంకించుకుంది.
Advertisement
Advertisement
అంతేకాకుండా వారితో వాదించలేక శోభ, ప్రియాంక కాళ్లు పట్టుకొని వదిలేయండి అమ్మా నేను వెళ్ళిపోతాను అని చెప్పుకొచ్చింది. ఇంక ఇంకో పక్క గౌతమ్, శివాజీ మధ్య పెద్ద రచ్చ జరిగింది. దానికి శివాజీ ఫైర్ అయ్యాడు. బయట జనాలు చూస్తున్నారు.. నిజాయితీగా లేని ఎవరినైనా బయటకు పంపండి. అందులో నేను ఉంటే నన్ను కూడా బయటకు పంపండి అంటూ.. నామినేట్ అంగీకరించాడు. ఈ వారం ఎవరు నామినేట్ అవుతారనేది వేచి చూడాలి మరీ.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!