Home » బిగ్ బాస్ 6 లోకి టిక్ టాక్ దుర్గారావు..ఫ్యాన్స్ కు పండ‌గే..!

బిగ్ బాస్ 6 లోకి టిక్ టాక్ దుర్గారావు..ఫ్యాన్స్ కు పండ‌గే..!

by AJAY
Ad

బిగ్ బాస్ నాలుగు సీజన్ లు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. కానీ సీజన్ 5 మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ రేటింగ్ మాత్రం గత సీజన్ల కంటే ఎక్కువగానే వచ్చిందని నిర్వాహకులు ప్రకటించారు. ఇక బిగ్ బాస్ సీజన్ 6 ను మ‌రింత క‌ల‌ర్ ఫుల్ గా అదేవిధంగా గత సీజన్ల కంటే ఎక్కువ వినోదాన్ని పంచేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

అంతేకాకుండా సీజన్ -5 మాదిరిగానే ఈ సీజన్ లో కూడా సోషల్ మీడియాలో సెలబ్రిటీలను ఎక్కువగా తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఇక ఇప్పటికే సీజ‌న్ 6 లోకి జబర్దస్త్ వర్ష వెళుతుంద‌ని వార్త‌లు వ‌చ్చిన‌ సంగతి తెలిసిందే. అదేవిధంగా యాంకర్ శివ పేరు మరియు ఢీ విన్నర్ రాజు పేరు కూడా వినిపిస్తోంది.

Advertisement

ఇక తాజాగా బిగ్ బాస్ 6 లోకి వెళుతున్నాడు అంటూ మరో సోషల్ మీడియా స్టార్ పేరు తెరపైకి వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 6 కోసం టిక్ టాక్ స్టార్ దుర్గారావును సంప్రదించినట్టు తెలుస్తోంది. దుర్గారావు టిక్ టాక్ లో పాత సినిమా పాటలకు తన భార్యతో కలిసి స్టెప్పులు వేసి ఆకట్టుకున్నాడు.

అలా టిక్ టాక్ లో ఎంతో పాపులారిటీ సంపాదించారు. మారుమూల గ్రామానికి చెందిన దుర్గారావు తక్కువ కాలంలోనే తన టాలెంట్ తో జబర్దస్త్ అవకాశం దక్కించుకున్నాడు. ఆ తర్వాత సినిమా అవకాశాలను సైతం దక్కించుకున్నారు. అంతేకాకుండా తన భార్యతో కలిసి దుర్గారావు ప‌లు టీవీ షోల‌లో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆయన బిగ్ బాస్ సీజన్ 6 ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే షో ప్రారంభం అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

Visitors Are Also Reading