Home » Bigg Boss-5 promo : గ్రాండ్ ఫినాలేలో నెవ్వర్ బిఫోర్ సెలబ్రేషన్స్…!

Bigg Boss-5 promo : గ్రాండ్ ఫినాలేలో నెవ్వర్ బిఫోర్ సెలబ్రేషన్స్…!

by AJAY
Ad

బిగ్ బాస్ సీజన్- 5 గ్రాండ్ ఫినాలే ఈ రోజు ప్రసారం కానుంది. అయితే ఇప్పటికే బిగ్ బాస్ సీజన్-5 విన్నర్ గా సన్నీ నిలిచాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా రన్నర్ గా సింగర్ శ్రీరామ్ నిలిచాడని.. ఇక టాప్ త్రీ కంటెస్టెంట్ గా షణ్ముఖ్ జస్వంత్ నిలిచాడని ప్రచారం జరుగుతోంది. అదే విధంగా మానస్ మరియు సిరి వరుసగా 4,5 స్థానాల్లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే గ్రాండ్ ఫినాలే ప్రోమో కూడా విడుదలైంది. ముందు నుండి అనుకున్నట్టుగానే ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే హైలెట్ గా ఉండబోతుందని ప్రోమో చూస్తేనే అర్థమవుతోంది.

Advertisement

Bigg Boss season-5

Bigg Boss season-5

విన్నర్ ఎవరు అన్నది ముందే లీక్ అవడంతో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే సెలబ్రేషన్స్ పైనే దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తోంది. ఇక ఈ సీజన్ లో గెస్ట్ లుగా దర్శకధీరుడు రాజమౌళి హాజరయ్యారు. అంతేకాకుండా శ్రీయ సరన్ స్టెప్పులతో అలరించనుంది. అంతే కాకుండా రాహుల్ సిప్లిగంజ్ తన పాటతో అలరించారు. బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్ బీర్ కపూర్ అలియా బట్ కూడా ఈ సీజన్ కు గెస్ట్ లుగా విచ్చేశారు. అంతేకాకుండా పుష్ప సినిమా టీమ్ నుంచి సుకుమార్, రష్మిక కూడా సెలబ్రేషన్స్ కు అతిథులుగా హాజరయ్యారు. ఇక గత సీజన్ల సభ్యులు కూడా ఫినాలే లో సందడి చేశారు.

Advertisement

వీరితో పాటు శ్యామ్ శింగరాయ్ హీరో నాని, హీరోయిన్లు సాయి పల్లవి, కృతి శెట్టి కూడా హాజరయ్యారు. దాంతో ఫినాలే పూర్తిగా కలర్ ఫుల్ గా ఉండబోతుంది అని క్లారిటీ వచ్చేసింది. ఇక ప్రోమో ఎంతో వినోదాత్మకంగా ఉండటం తో ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తెలుగులో ఇంతమంది సెలబ్రిటీలు ఓకే షోకు రావడం కూడా ఇదే మొదటి సారి చెప్పాలి. మరి షో ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.

Visitors Are Also Reading