Home » Bigg Boss 7 : బిగ్‏బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ వీళ్ళే.. ఈసారి అదిరిపోయిందిగా.. లిస్ట్ ఓ లుక్ వేయండి!

Bigg Boss 7 : బిగ్‏బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ వీళ్ళే.. ఈసారి అదిరిపోయిందిగా.. లిస్ట్ ఓ లుక్ వేయండి!

by Srilakshmi Bharathi
Published: Last Updated on

ఎన్ని మీమ్స్ వచ్చినా, ఎంత ట్రోలింగ్ జరుగుతున్నా.. బిగ్ బాస్ సీజన్ చూసే వాళ్ళకి కొదవ లేదు. చాలా మంది బిగ్ బాస్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఈ రియాలిటీ షో ఎన్ని సీజన్స్ వచ్చినా ఆడియన్స్ లో జోష్ తగ్గదు. అయితే.. ప్రతి సారీ ఈ సీజన్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అన్న విషయం ఆసక్తికరంగా మారుతూ ఉంటుంది. తాజాగా.. బిగ్‏బాస్ సీజన్ 7 రాబోతోంది. ఎప్పటిలానే, నాగార్జున ఈ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ సారి బిగ్‏బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ లిస్ట్ వచ్చేసింది. ఈ సారి బిగ్ బాస్ లో పాల్గొనబోయేది వీరే అంటూ ఓ లిస్ట్ నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది. అయితే.. సీజన్ 6 లో జరిగిన తప్పులు జరగకుండా చూసుకుని డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ సీజన్ కి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కాగా.. కంటెస్టెంట్స్ అందరు ప్రేక్షకులకు తెలిసినవారే. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ లిస్ట్ చక్కర్లు కొడుతోంది.

సీరియల్ హీరోగా పాపులర్ అయిన అమర్ దీప్ తన భార్య తేజస్వినితో పాటు ఎంట్రీ ఇస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ నోయెల్ తన ఎక్స్ వైఫ్ ఈస్టర్ తో పాటు ఎంట్రీ ఇస్తారని టాక్ వినిపిస్తోంది. బుల్లితెర యాంకర్లు రష్మీ, విష్ణుప్రియ, కార్తీక దీపం ఫేమ్ శోభా శెట్టి, ఢీ పండు, నిఖిల్, ప్రియా, సాయి రోనాక్, సిద్ధర్థ్ వర్మ, మహేష్ బాబు, కాళిదాసు, జబర్ధస్త్ అప్పారావు, మోహన శోభరాజు లు బిగ్‏బాస్ సీజన్ 7 లో పాల్గొంటున్నారని తెలుస్తోంది.

మరిన్ని..

అఖిల్ పుట్టాక అమల సంచలన నిర్ణయం.. నాగచైతన్య కోసమే ?

ఆస్పత్రిలో చేరిన బండ్ల గణేష్.. ఆందోళనలో ఫ్యాన్స్ ?

మహేష్‌బాబు నాన్న చనిపోతే జగన్ వెళ్లి నవ్వుతాడు : పవన్ కళ్యాణ్

Visitors Are Also Reading