Home » విజయ్-వెంకట్ ప్రభు మూవీలో ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్..!

విజయ్-వెంకట్ ప్రభు మూవీలో ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్..!

by Anji
Ad

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వరుస హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న విజయ్.. రీసెంట్ గా టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు, అగ్ర దర్శకుల్లో ఒకరైనటువంటి వంశీ పైడిపల్లితో వారసుడు సినిమా చేసిన విషయం తెలిసిందే. అయితే విజయ్ దళపతి-దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనుందని గత కొద్ది రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తలు వాస్తవం అని ఇటీవల అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కస్టడీ మూవీతో డిజాస్టర్ అందుకున్న వెంకట్ ప్రభుకి విజయ్ దళపతి ఛాన్స్ ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తమవుతోంది.

Advertisement

ఏజీఎస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాాజా సంగీతం అందించనున్నాడు. ఈ సినిమా విషయంలో మరో ఆసక్తి కర అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అది ఏంటంటే.. ఈ మూవీలో విజయ్ డ్యుయల్ రోల్ లో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీని అనౌన్స్ చేస్తూ.. ఆ మధ్య రిలీజ్ చేసిన వీడియోలో విజయ్ పేరుకు పక్కన ఎన్టీఆర్ అనే అక్షరాలున్న నేపథ్యంలో ఈ మూవీలో ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడనే ఊహగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

తాజాగా ఇప్పుడు వినిపిస్తున్న టాక్ కూడా ఈ మూవీ పై భారీ అంచనా పెంచేశాయి. ఈ గాసిప్ లో వాస్తవం ఎంతో తెలియదు. కానీ ఒక వేళ నిజమైతే కనుక మరో క్రేజీ పాన్ ఇండియా సినిమా అయ్యే అవకాశముంది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ తో దర్శకత్వంలో లియో సినిమాలో నటిస్తున్నాడు విజయ్. త్వరలో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. సినిమా ప్రారంభం కాకముందే తరచూ ఏదో ఒక అప్డేట్ తో అంచనాలు పెంచుతున్న ఈ మూవీ ద్వారా అయినా డైరెక్టర్ వెంకట్ ప్రభుకి బ్లాక్ బస్టర్ అందుతుందో లేదో వేచిచూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

రోజుకు మూడు షిఫ్ట్ లలో పని చేసే కృష్ణ.. 1975లో ఒక్క సినిమా కూడా చేయలేదు.. కారణం ఏంటి ?

Nara Lokesh : బ్రాహ్మణితో లోకేష్ ప్రేమాయణం.. బాలయ్యకు భయపడి పాపం ?

ఖుషి మ్యూజికల్ కన్సర్ట్ లో విజయ్ వ్యాఖ్యలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!

Visitors Are Also Reading