Home » నాగబాబు కూతురుకి జగన్ సర్కార్ బిగ్ షాక్..!

నాగబాబు కూతురుకి జగన్ సర్కార్ బిగ్ షాక్..!

by Sravya
Ad

నిహారిక కి జగన్ సర్కార్ నుండి పెద్ద షాక్ తగిలింది. మెగా డాటర్ నిహారిక ఇప్పుడు ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది విడాకుల తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో యాక్టివ్ కావడానికి ట్రై చేస్తోంది నిహారిక ఈమె వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. చైతన్య అనే అతన్ని పెళ్లి చేసుకుని పెద్దల సమక్షంలో ఒకటైన ఈ జంట కొన్ని రోజుల తర్వాత విడిపోయారు ఎక్కువ కాలం వీళ్ళ వైవాహిక జీవితాన్ని కొనసాగించలేకపోయారు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో పెళ్లైన ఏడాదికి భర్తతో విడాకులు తీసుకుంది. నిహారిక విడాకుల తర్వాత కొంతకాలం సైలెంట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో ఫుల్ జోష్లో కనపడుతోంది.

Jagan-govt-shock-to-niharika

Advertisement

 

తాజాగా ఒక ఇంటర్వ్యూ లో నిహారిక తన పొలిటికల్ ఎంట్రీ తో పాటుగా బాబాయ్ జనసేన పార్టీ గురించి కూడా ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. వచ్చే ఎన్నికల్లో మీరు పోటీ చేస్తున్నారా అని అడిగితే నేను పోటీ చేయట్లేదు కావాలంటే పార్టీ తరపున పని చేయడానికి మెగా ఫ్యామిలీ సిద్ధంగా మెగా ఫ్యామిలీ ఉందని నిహారిక చెప్పారు వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించాలని దేవున్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు ఏపీలో ఇల్లు కొనాలని చూస్తున్నామని నాన్న ఎక్కడినుండి పోటీ చేస్తే అక్కడ ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నాము. ఒకవేళ పోటీ చేయకపోయినా ఒకచోట ఇల్లు తీసుకోవాలని అనుకుంటున్నట్లు నిహారిక చెప్పింది.

Advertisement

Cm Jagan

నాన్న రాజకీయాల్లో బాగా బిజీగా ఉన్నారని ఈ మధ్య ఐదు నిమిషాలు కూడా మాట్లాడలేదని నిహారిక చెప్పుకొచ్చారు ఒక పక్క సినిమాలతో ఇంకొక రాజకీయాలతో పవన్ కళ్యాణ్ బిజీగా ఉంటున్నారని కష్టపడుతున్నారని చెప్పారు నిహారిక. సినిమాలో నటించిన డబ్బులతోనే పార్టీ ని కుటుంబాన్ని నడిపించాలి. ఎందుకంటే బాబాయ్ కి ఆస్తులు ఏమీ లేవని చెప్పారు ఆంధ్రాలో తన ఓటుని తొలగించారని నా ఓటుని ఎందుకు రద్దు చేస్తారో తెలియట్లేదు అని నిహారిక షాకింగ్ కామెంట్స్ చేశారు. నిహారిక ఇప్పుడు మంచు మనోజ్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. హీరోయిన్ గా వాట్ ది ఫిష్ లో నిహారిక కనపడబోతున్నారు ఇప్పుడు పలు షోస్ తో కూడా బిజీగా ఉంటున్నారు.

 

Visitors Are Also Reading