Home » “నయిమ్ డైరీస్” సినిమాను అడ్డుకున్న తెలంగాణ ఉద్యమకారులు…

“నయిమ్ డైరీస్” సినిమాను అడ్డుకున్న తెలంగాణ ఉద్యమకారులు…

by Bunty

ఇవాళ విడుదల అయిన నయిమ్ డైరీస్ సినిమాను అడ్డుకున్నారు తెలంగాణ ఉద్యమకారులు… తెలంగాణ ఉద్యమ కారిని బెల్లి లలితను కించపరిచే విధంగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని ఆరోపణలు చేశారు… ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంధ్య థియేటర్ వద్ద తెలంగాణ ఉద్యమకారులు ఆందోళనకు దిగారు. అంతే కాదు.. థియేటర్ ముందు బైఠాయించారు. నయీమ్ డైరిస్ సినిమా పోస్టర్ లను, ఫ్లెక్సీలను చించివేసి దహనం చేశారు ఉద్యమకారులు. సంధ్య 35 ఎం ఎం థియేటర్లో సినిమా విడుదల కాకుండా అడ్డుకున్నారు ఉద్యమకారులు.

ఈ సినిమా ను రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించామని తెలంగాణ ఉద్యమ కారులు బత్తుల సిద్దేశ్వర్,మల్లేశం పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులను కించపరిచే సినిమాలు రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ ఉద్యమకారులు.

ఉద్యమకారులకు అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై సంధ్య థియేటర్ మేనేజర్ మధుసూదన్… మాట్లాడుతూ.. కొంత మంది ఉద్యమకారులు వచ్చి సినిమా విడుదలను అడ్డుకున్నారన్నారు. మా యాజమాన్యానికి విషయాన్ని తెలియజేశామని.. మార్నింగ్ షో సినిమా ను నిలిపివేశామని వెల్లడించారు. యాజమాన్యం నుండి వచ్చే సమాచారాన్ని బట్టి సినిమా విడుదల పై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

Visitors Are Also Reading