బలగం..ఈ పేరులోనే ఉంది పూర్తి అర్థం.. ఒకప్పుడు పల్లెటూరిలో ఉమ్మడి కుటుంబాలు ఉన్న సమయంలో ఆ కుటుంబం నుంచి ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం అంతా ఏ విధంగా బాధపడేది, దశదినకర్మ వరకు ఆ కుటుంబం చేసే సంస్కృతి సాంప్రదాయాలు వివిధ పనుల గురించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చాలా సింపుల్ గా.. క్లియర్ గా.. తెరకెక్కించారు డైరెక్టర్ వేణు.. సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లోకి వచ్చి కోట్లాది బలగమును సినిమా చూసేలా చేస్తోంది.. దాదాపు రెండు కోట్లు కూడా లేని బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ దాదాపుగా 25 కోట్లకు పైగా వసూళ్లు చేపట్టింది.. ప్రస్తుతం బలగం మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ చిత్రానికి పోటీగా దాస్ కా దమ్ కి, రంగమార్తాండ, ప్రస్తుతం దసరా సినిమా కూడా రిలీజ్ అయింది.
also read:‘రంగస్థలం’ మూవీకీ, ‘దసరా’కి మధ్య సరికొత్త సంబంధం.. నాని ఖాతాలో రికార్డుల మోతే..!!
Advertisement
Advertisement
అయినా ఆ సినిమాలన్నింటిని పక్కన పెట్టేసి బలగం వైపే జనాలు మొగ్గు చూపుతున్నారంటే ఇది జనాలకు ఎంతగా కనెక్ట్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి బలగం మూవీ కథపరంగా ఎంతో బాగున్నప్పటికీ దర్శకుడు వేణు మాత్రం చాలా బిగ్ మిస్టేక్స్ ఈ సినిమాలో చేశారని చెప్పవచ్చు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..ఈ సినిమాలో హీరో మేనత్త కూతుర్ని వివాహం చేసుకొని అప్పులు తీర్చాలనుకుంటాడు. కానీ తెలంగాణలో చాలావరకు మేనత్త కూతుర్ని వివాహం చేసుకోరు. కేవలం మేనమామ బిడ్డను మాత్రమే వివాహం చేసుకుంటారు. తెలంగాణ సాంప్రదాయం ప్రకారం చూస్తే ఇంట్లో తండ్రి లేదా తల్లి చనిపోయిన దశదిన కర్మ రోజు కొడుకులు, ఇతర కుటుంబ సభ్యులు తప్పనిసరిగా గుండు గీయించుకుంటారు.
also read:IPL 2023 : కెప్టెన్సీ మీట్ కు రోహిత్ దూరం… ఐపీఎల్ కు దూరం కానున్నాడా ?
కానీ ఈ చిత్రంలో అది లేదు. అంతేకాకుండా కాకి ముట్టకపోతే ఊర్లో వారికి మంచి జరగదనేది, ఊర్లో నుంచి వెలివేస్తారనేది తెలంగాణ సాంప్రదాయంలో ఇప్పటి వరకు చూడలేదు. పూర్వకాలంలో ఏదైనా జరిగి ఉండవచ్చు. అలాగే కాకి ముట్టకపోతే కుక్కను, లేదంటే బర్రె ఆవు లాంటి జంతువులతో పిండాలను తినిపిస్తారు. కానీ ఈ సినిమాలో కొన్ని లేని సంప్రదాయాలను పెట్టారని కొంతమందిని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోతున్న ఈ తరుణంలో మరోసారి గుర్తు చేసినందుకు దర్శకుడు వేణుకు, నిర్మాత దిల్ రాజుకు అభినందనలు తెలియజేస్తున్నారు బలగం సినిమా అభిమానులు.
also read:IPL 2023 : షారుఖ్ ఖాన్, విరాట్ కోహ్లీ మధ్య ట్విట్టర్ వార్.. !