Ad
భారత జట్టుకి ఐపీఎల్ ద్వారా ఎంతమంది యువ ఆటగాళ్లు దొరుకుతున్నారు అనే విషయం అందరికి తెలిసిందే. ఈ ఐపీఎల్ వల్లనే ఇప్పుడు జట్టులో ఉన్న యువ ఆటగాళ్లు అందరూ వెలుగులోకి వచ్చారు. ఇక అందులో టీం ఇండియా యువ పేసర్ అర్షదీప్ సింగ్ కూడా ఉన్నాడు. ఈ ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టు తరపున అద్భుతమైన బౌలింగ్ అనేది చేసిన అర్షదీప్ ను టీం ఇండియాకు ఎంపిక చేసారు సెలక్టర్లు. కానీ ఎక్కువ అవకాశాలు అనేవి మాత్రం ఇవ్వడం లేదు.
ఇంగ్లాండ్ పర్యటనలో ఒక మ్యాచ్ ఆడించిన బీసీసీఐ.. ఇప్పుడు ఉన్న విండీస్ పర్యటనలో మొదటి టీ20 లోనే అవకాశం అనేది ఇచ్చింది. అయితే ఈ రెండు మ్యాచ్ లలో కూడా రెండు రెండు వికెట్లు అనేవి తీసి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే భారత సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అర్షదీప్ పై ప్రశంసలు కురించాడు. అర్షదీప్ దగ్గర చాలా మెచ్యూరిటీ అనేది ఉందిహ్ అని పేర్కొన్నాడు.
తాజాగా భువీ విండీస్ లో మీడియాతో మాట్లాడుతూ.. అర్షదీప్ పరిస్థితులను బాగా అర్ధం చేసుకుంటాడు. దానికి తగ్గిన విధంగానే బౌలింగ్ కూడా చేస్తాడు. అతని ఏ బ్యాటర్ కు ఎలాంటి బంతులు వేయాలో బిగా తెలుసు. ఐపీఎల్ కూడా అతను డెత్ ఓవర్లలో చాలా మెచ్యూరిటీ అనేది చూపించాడు. ఎన్నో మ్యాచ్ లు ఆడిన తర్వాత వచ్చే మెచ్యూరిటీ అనేది అర్షదీప్ కు ప్రారంభం నుండే ఉంది. ఇక ఫీల్డింగ్ సెట్టింగ్స్ కూడా ఎలా ఉపయోగించుకోవాలి అనేది అతనికి తెలుసు. ఎలాంటి టాలెంట్ యువ ఆటగాళ్లలో చాలా తక్కువ కనిపిస్తుంది అని భువీ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :
రోహిత్ కంటే దినేష్ గ్రేట్.. ఎలా అంటే..?
ధోనీ, కోహ్లీ రికార్డులపై మహిళా ప్లేయర్స్ ఆధిపత్యం..!
Advertisement