టాలీవుడ్ నటుడు సునీల్ ఓవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా అవకాశం దొరికితే ఏ పాత్రలోనైనా లీనమైపోతారు. తాజాగా సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష, పృథ్వీరాజ్, ధనరాజు, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషించి నటించిన చిత్రం భువనవిజయమ్. శ్రీమతి లక్ష్మి సమర్పణలో హిమాలయ స్టూడియో మ్యాన్షన్స్ బ్యానర్‌పై పి.ఉదయ్ కిరణ్, వి.శ్రీకాంత్ లు నిర్మాతలుగా వ్యవహరించిన ఈ మూవీకి యలమంద చరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇవాళ థియేటర్ లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందో లేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : Custody Review : “కస్టడీ” రివ్యూ..మరో శివ సినిమా అయిందా ?
Advertisement
కథ మరియు విశ్లేషణ :
ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఒక నిర్మాతకు కథ చెప్పడానికి మొత్తం 8 మంది వస్తారు. వాళ్లలో ఒకరు మరికాసేపట్లో చనిపోతారని తెలుస్తోంది. ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు అనేది ఈ సినిమా కథ అన్నమాట. దాని చుట్టూ తిరిగే కథ ఇంట్రెస్టింగ్ గా, కాస్త థ్రిల్లింగ్ గా సాగుతుంది. మూవీ మొత్తానికి మంచి ఎంటర్టైన్ మెంట్ ఉందనే చెప్పవచ్చు. శేఖర్ చంద్ర సంగీతం ప్రేక్షకులను బాగా మెప్పిస్తుంది. బీజీఎం అట్రాక్టివ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే కూడా పర్వాలేదనిపిస్తోంది.
Advertisement
Also Read : CHATRAPATI REVIEW : ఛత్రపతి రివ్యూ…బెల్లంకొండ బాలీవుడ్ లో హిట్ కొట్టాడా..?
సాధారణంగా ఒక సినిమాపై ఆసక్తి పెరగాలంటే ప్రమోషనల్ కంటెంట్ చాలా కొత్తగా ఉండాలి. సినిమా చూడాలనే ఆసక్తిని పెంచాలి. సునీల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భువన విజయమ్ ఈ విషయంలో ఆకట్టుకుందనే చెప్పవచ్చు. భువన విజయమ్ టైటిల్ తోనే సగానికి పైగా మార్కులు కొట్టేసింది. ఆ తరువాత వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్, థీమ్ సాంగ్ వాటిని రెట్టింపు చేసింది. ప్రతీసారి కామెడీతో పాటు ఎమోషనల్ గా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఫస్టాప్ మొత్తం కాస్త స్లోగా స్టోరీ వెళ్లితే.. సెకండ్ హాఫ్ లో అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఎందుకు జరుగుతుంది? ఎలా జరుగుతుంది ? అనే టెన్షన్ కొంత స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాకి క్లైమాక్స్ హైలెట్ అనే చెప్పవచ్చు. క్లైమాక్స్ ఊహించని విధంగా తెరకెక్కించాడు దర్శకుడు. మూవీ నెరెషన్ అక్కడక్కడ బోర్ కొట్టిస్తుంది. మొత్తానికి కామెడీ, సస్పెన్స్ లతో కూడిన సినిమా భువనవిజయమ్ అని చెప్పవచ్చు. ఇంకెందుకు ఆలస్యం థియేటర్లోకి వెళ్లి ఓ సారి చూసేయండి.
ప్లస్ పాయింట్లు:
- కామెడీ
- సస్పెన్స్ సీన్లు
- మ్యూజిక్
- క్లైమాక్స్
మైనస్ పాయింట్లు :
- ఫస్టాప్ స్లో
- సాగదీత
- అక్కడక్కడ టెన్షన్ టెన్షన్
సినిమా రేటింగ్: 2.3/5