Home » ఫ్యాన్స్ కు శివ‌రాత్రి ట్రీట్ ఇచ్చిన మెగాస్టార్…భోళాశంక‌ర్ లుక్ అదుర్స్..!

ఫ్యాన్స్ కు శివ‌రాత్రి ట్రీట్ ఇచ్చిన మెగాస్టార్…భోళాశంక‌ర్ లుక్ అదుర్స్..!

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి వ‌రుస సినిమాల‌తో టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే ఆచార్య సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకోగా ఈ సినిమా విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. ఇదిలా ఉండ‌గానే చిరు వ‌రుస సినిమాల షూటింగ్ ల‌తో బిజీగా ఉన్నారు. ఇక చిరు మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం లో కూడా ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి భోళా శంక‌ర్ అనే సినిమాలో న‌టిస్తున్నారు.

Advertisement

Advertisement

ఈ సినిమాలో త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది. ఏకే ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మ‌హతి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను శివ‌రాత్రి సంద‌ర్భంగా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. పోస్టర్ లో చిరంజీవి స్టైలిష్ లుక్ లో క‌నిపిస్తున్నారు. గ్లాసెస్ పెట్టుకుని స్టైలిష్ గా జీప్ ద‌గ్గ‌ర నిలుచున్నారు. ఇదిలా ఉండ‌గా మెగాస్టార్ బాబీతో పాటూ ప‌లువురు యంగ్ డైరెక్ట‌ర్ ల‌తోనూ సినిమాలు చేస్తున్నారు.

Visitors Are Also Reading