ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నీ తానే అయి నిజాంలో కింగ్ అనిపించుకుందాం అనుకున్నారు. కానీ ఈసారి చాలా పెద్ద దెబ్బ తగిలింది. అతను డిస్ట్రిబ్యూట్‌చేస్తున్న ఆర్ఆర్ఆర్ ఇప్పుడు వాయిదా అయింది. దిల్‌రాజు ఆర్ఆర్ఆర్ పై చాలా డబ్బులు పెట్టి నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు. అదేవిధంగా అతనే భీమ్లానాయక్ కు కూడా నైజాం ఏరియా రైట్స్ కొన్నారు. ఇవన్నీ ఇలా ఉంటే తెలుగు ప్రొడ్యూసర్ ఆక్టివ్ గిల్డ్ అంటే తాను ఒక్కడే అందులో ఆక్టివ్ అన్నట్టుగా వ్యవహరించి భీమ్లానాయక్ సినిమాను వాయిదా వేయించాడని టాక్. అప్పుడు జరిగిన ప్రెస్ మీట్‌కు భీమ్లానాయక్ నిర్మాతలు కూడా రాలేదు. ఎందుకు అంటే వాళ్లకు దిల్‌రాజు మీద చాలా కోపం ఉంది.
Advertisement
Advertisement
అటు ఆర్ఆర్ఆర్, ఇటు భీమ్లానాయక్ రెండు సినిమాల్లో ఒక్కటి కూడా పండుగకు రాలేదు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సమయంలోనే వసూళ్లు బాగా ఉంటాయి. మా సినిమా కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేస్తాం అని భీమ్లానాయ్ నిర్మాతలు చెప్పినా వినకుండా దిల్‌రాజు పోస్ట్‌పోన్ చేయించారు. ఆ పోస్ట్‌పోన్ చేయించిన సందర్భంలో దిల్‌రాజు చాలా గొప్పలు చెప్పుకున్నాడని టాక్. అంతా తానే చేశానని.. ఇప్పుడు ఏమైంది మొత్తం అది పాయే, ఇది రాకపాయే అని భీమ్లానాయక్ నిర్మాతలు దిల్‌రాజును తిడుతున్నారట. ఇక దిల్‌రాజు తన సొంత సినిమా కోసం పాట్లు పడుతున్నాడట.