Home » పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… భీమ్లా నాయక్ ట్రైలర్ డేట్ ఫిక్స్…!

పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… భీమ్లా నాయక్ ట్రైలర్ డేట్ ఫిక్స్…!

by AJAY
Published: Last Updated on
Ad

మెగాపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమాను మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషీయం సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు. ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో రానా కూడా ముఖ్యమైన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

Bheemla nayak

Advertisement

అయితే చిత్రంలో పవన్ కళ్యాణ్ కు భార్యగా నిత్యా మీనన్ నటించగా రానా కు జోడిగా సంయుక్త మీనన్ నటించింది. చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతే కాకుండా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి యూ ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.

Advertisement

ఇదిలా ఉండగా ఈ సినిమా టీజర్ మరియు పాటలు విడుదల కాగా ప్రేక్షకుల్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా సినిమా ట్రైలర్ పై అంచనాలు భారీగా పెరిగాయి. కాగా ట్రైలర్ ను ఫిబ్రవరి 19న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ట్రైలర్ అంటూ దీనిపై చిత్ర యూనిట్ హింట్ కూడా ఇచ్చింది. మరి ట్రైలర్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Visitors Are Also Reading