Bheemla nayak Review and Rating: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. సినిమాను మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియం సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో రానా పవన్ కల్యాణ్ ను ఢీ కొట్టే పాత్రలో నటించారు. అంతే కాకుండా సినిమాలో నిత్యామీనన్ పవన్ కు భార్యగా నటించగా…రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటించింది. ఇక ఎన్నో అంచనాల మధ్య భీమ్లా నాయక్ సినిమా నేడు థియేటర్ లలో విడుదలైంది. కాగా ఈ సినిమాకు సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
ALSO READ : బిగ్ బాస్ తెలుగు ఓటిటి లోకి నాని హీరోయిన్….!
Advertisement
సినిమా చూసిన నెటిజన్లు ట్విట్టర్ లో రివ్యూలు ఇస్తున్నారు. ఆ లెక్కన చూసుకుంటే భీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్ అంటూ రివ్యూలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా పవన్ కల్యాణ్ కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా నిలిచిపోయిందని నెటిజన్లు అంటున్నారు. దశాబ్దం తరవాత మళ్లీ పవన్ కల్యాణ్ తిరుగులేని బ్లాక్ బస్టర్ అందుకున్నారని అంటున్నారు. పవన్ కల్యాణ్ కొన్ని సీనల్లో హై ఓల్టేజ్ తో కనిపించారని ఆ సీన్లు సినిమాలోనే హైలెట్ అంటూ రివ్యూలు వినిపిస్తున్నాయి.
Advertisement
అంతే కాకుండా అజ్ఞాతవాసి అప్పును బారువడ్డీ చక్రవడ్డీతో తిరిగిచ్చేశారని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో రానా పవన్ కల్యాణ్ మధ్య ఉండే సీన్లు ఎంతగానో ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. ఇది పవన్ కెరీర్ లోనే మరో గబ్బర్ సింగ్ గా నిలిచిందని అంటున్నారు. సినిమాలో డైలాగులు బీజీఎం అదిరిపోయాయని చెబుతున్నారు. తమన్ మ్యూజిక్ అదరగొట్టాడని చెబుతున్నారు.
సినిమాలో రానా నటన కూడా ఎంతో బాగుందని డానియల్ శేఖర్ పాత్రలో రానా జీవించేశాడని చెబుతున్నారు. మరో వైపు ఫస్ట్ హాఫ్ కాస్త నీరసంగా ఉందని కూడా రివ్యూలు వస్తున్నాయి. కానీ సెకండ్ హాఫ్ లో గూస్ బంప్స్ వచ్చే సీన్లు ఉన్నాయని చెబుతున్నారు. ఇది వపన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు మాస్ జాతర అవుతుందని అంటున్నారు. అంతే కాకుండా కామన్ ఆడియన్స్ కు కూడా సినిమా ఎంతగానో నచ్చుతుందని అంటున్నారు.