పవర్ స్టార్ పవన్ కల్యాన్ తాజా సినిమా భీమ్లా నాయక్ కొన్నాళ్ల క్రితం మలయాళంలో బిజూ మీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి నటించిన అయ్యప్పనుం కోషియం సినిమాకు అఫీషియల్ రీమెక్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. పవన్ కళ్యాణ్, రానా కలిసి తొలిసారిగా నటిస్తున్న ఈ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ కథానాయికలుగా నటిస్తుండగా.. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. యువ దర్శకుడు సాగర్ కె చంద్ర తీస్తున్న ఈ యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్‌లో భీమ్లా నాయక్ అనే పోలీస్ అధికారి పాత్రలో పవన్ కనిపించనుండగా.. డ్యానియల్ శేఖర్ పాత్రను రానా చేస్తున్నారు.
Advertisement
Bheemla Nayak Release date | Manamnews
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తేదీ కన్‌ఫామ్ కావడంతో ఇప్పుడు వరుసగా పలువురు బడా నిర్మాతలు తమ చిత్రాల విడుదల తేదీలను రీ షెడ్యూల్ చేస్తూ ఉన్నారు. ఆచార్య సినిమాను ఏప్రిల్ 29న, ఎఫ్-3 ఏప్రిల్ 28, మే 12 సర్కారు వారి పాట విడుదల చేయనున్నట్టు ప్రకటించారు నిర్మాతలు. పవన్ కల్యాణ్, రానాతో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ‘భీమ్లా నాయక్’ కోసం ఏకంగా రెండు తేదీలను బ్లాక్ చేసి పెట్టారు.
Advertisement
Pawan kalyan and Modi Image Credits : pawankalyan facebook page
అన్ని రకాలుగా పరిస్థితులు అనుకూలిస్తే… ముందు అనుకున్నట్టు ఫిబ్రవరి 25న మూవీని విడుదల చేస్తామని, లేదంటే ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత ప్రకటించారు.
Bheemla Nayak Release date | Manamnews
ఇదిలా ఉంటే చిరంజీవి ‘ఆచార్య’, వెంకటేశ్, వరుణ్ తేజ్ ‘ఎఫ్ 3’ చిత్రాలు రెండూ ఒక రోజు తేడాతో వస్తాయా అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ‘ట్రిపుల్ ఆర్’ చిత్రాన్ని ముందు చెప్పినట్టుగా మార్చి 18, ఏప్రిల్ 28న కాకుండా రాజమౌళి బృందం మార్చి 25న విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించినట్టుగానే.. ‘భీమ్లా నాయక్’ సైతం మరొక తేదీలో వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని తెలుస్తోంది. మొత్తం మీద ఒక్కసారిగా ఈ పెద్ద సినిమాల విడుదల తేదీలను ప్రకటించడంతో టాలీవుడ్ లో చర్చోపచర్చలు ప్రారంభం అయ్యాయి.