చాలామంది ఓటీటీ లో వచ్చే ప్రత్యేక వెబ్ సిరీస్ లని సినిమాలను చూస్తున్నారు. కొరియన్ సిరీస్, హాలీవుడ్ సినిమాల లాగే ఇండియన్ సినిమాల్లోని సిరీస్ లలో జాంబీ ఆధారిత సినిమాలు, సిరీస్ లు వస్తున్నాయి. ఇండియాలో ఇదే ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది మీ మనసులో భయాన్ని పెంచేస్తూ, ఈ నాలుగు ఎపిసోడ్లు హారర్ సిరీస్ గురించి ఇప్పుడు చూద్దాం. ఈ సిరీస్ పేరు వచ్చేసి భేతాళ్. షారుఖ్ ఖాన్ గౌరీ ఖాన్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లిస్ ఎంటర్టైన్మెంట్ దీనిని నిర్మించింది. గత కొన్ని ఏళ్లుగా పౌరాణిక కథలతో సినిమాలు ధారావాహికలు రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే.
లేటెస్ట్ గా వచ్చిన ఈ సిరీస్ కూడా అలాంటిదే. ఈ సిరీస్ మే 2020లో వచ్చింది ఆదివాసుల బృందం ఒక గుడిలో ఆత్మ కోసం పూజలు చేస్తూ ఉంటారు. ఇలా ఈ సిరీస్ స్టార్ట్ అవుతుంది ఒక స్త్రీ ఆత్మ తో మాట్లాడుతుంది సారంగం తెరవ వద్దని దేవుడు తనని కోరుతాడని ఆ స్త్రీ అంటుంది. మరో పక్క ఈ సారంగ మార్గంలో జాతీయ రహదారిని నిర్మించాలని ప్రభుత్వం చూస్తుంది ఈ సొరంగాన్ని కూల్చడానికి గ్రామస్తులు నిరాకరిస్తారు.
Advertisement
Also read:
Advertisement
Also read:
తర్వాత ఫోర్స్ టీం ని ప్రభుత్వం రంగంలోకి దింపుతుంది ఫోర్స్ కెప్టెన్ గిరిజనులకి అక్కడి నుండి తొలగించడానికి వెళ్తాడు. అయితే ఈ క్రమం లో అతను ఈ పురాణం గురించి తెలుసుకుంటాడు. అయినా సరే అతను సొరంగం వేయాలని ఆదేశిస్తాడు. అప్పుడు భయంకరమైన ఘటన మొదలు అవుతుంది. సారంగం నుండి ఒక భయంకరమైన బ్రిటిష్ సైన్యం వస్తుంది. అప్పుడు దయ్యాల సైన్యంతో పోరాటం మొదలవుతుంది సిరీస్ మాత్రం చాలా భయంకరంగా వుంది. కొంచెం భయంకరమైన ముఖాలు ఉన్న వ్యక్తులు కనబడతారు రక్తం, కాల్పులు ఇటువంటివి చూస్తే భయం వేస్తుంది. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో వుంది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!