భారతదేశంలో నూనె మరియు కారంగా ఉండే ఆహారాన్ని ఇష్టపడే వారికి కొరత లేదు. కానీ వారికి ఉండే ఆ కోరికే అనేక ఇబ్బందులకు కారణం అవుతుంది. డీప్ ఫ్రైడ్ మరియు స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత ఎసిడిటీ మరియు హార్ట్ బర్న్ అనే సమస్యలు మనలో చాలామందిని వేధిస్తూ ఉంటాయి. ఈ వర్షాకాలంలో మనం తీసుకునే ఆహారం జీర్ణం అవ్వడానికి కొంచెం కష్టంగా మారుతుంది. దీని ద్వారా కడుపులో యాసిడ్ రిఫ్లెక్షన్స్ ఏర్పడి గుండెలో మంట, గ్యాస్ ప్రాబ్లం వంటి సమస్యలు తెచ్చి పెడతాయి.
Advertisement
తిన్న ఆహారం అరగక పడేతిప్పలు అన్నీఇన్నీకాదు. దీని ఫలితంగా కడుపునొప్పితో ప్రారంభమై వాంతులు, మలబద్ధకం,విరేచనాలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెద్దల్లో ఏర్పడితే సర్వసాధారణంగా కనిపించే గుండెమంటకు మీ వంటింట్లో దొరికితే ఈ 4 రకాల పదార్థాలు ఎంతగానో ఉపయోగపడతాయి. మరి ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
#1. వాము :
వాములో బయోకెమికల్ థైమోల్ అనే ఆమ్లం ఉంటుంది. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించడంలో ఎంతగానో సహకరిస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఒక స్పూన్ వాములో చిటికెడు ఉప్పు కలిపి మెత్తటి పొడిలా చేసి గ్లాస్ నీళ్లలో కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
#2.పాలు :
Advertisement
పుల్లని త్రేన్పులకు చక్కటి విరుగుడుగా పాలు బాగా పని చేస్తాయి. గోరు వెచ్చని పాలు గుండె మంట తగ్గించడంలో చక్కగా సహకరిస్తుంది. పాలల్లో కాల్షియం అధికంగా ఉండటంతో అది యాసిడ్ రిఫ్లక్షన్ను తగ్గించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.
# 3. పెరుగు :
పెరుగులో కాల్షియంతో పాటు, సహజమైన ప్రోబయోటిక్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు పెరుగు బాగా సహకరిస్తుంది. పెరుగును మజ్జిగగా చేసుకుని తాగడం వలన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ఎసిడిటీ మరియు గ్యాస్ సమస్యలను తగ్గించడంలో పెరుగు బాగా ఉపయోగపడుతుంది.
#4. అల్లం :
అల్లం గుండె మంట తగ్గించడంలో చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. . ఒక అంగుళం అల్లం ముక్కని తీసుకుని సన్నగా తరిగి పాలలో మరిగించి తీసుకోవడం వలన నా గుండెలో మంటకు ఉపశమనం కలుగుతుంది.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు :
కాలి వేళ్ళ మధ్య ఫంగల్ ఇన్ఫెక్షన్తో విసిగిపోతున్నారా..! అయితే ఈ రెమెడీ ట్రై చేసి చూడండి..!
Health tips :ఈ వాటర్ ను పొరపాటున కూడా పారబోయకండి.. అమృతంతో సమానం.. ఎందుకంటే?
Health tips: ఈ వేర్లు ఎక్కడ దొరికిన అసలు వదలకండి…! ముఖ్యంగా చిన్నపిల్లలకు ఎంతో అవసరం..!