Home » జాతీయ‌స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప‌విత్రా లోకేష్ సినిమా ఏదో తెలుసా…?

జాతీయ‌స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప‌విత్రా లోకేష్ సినిమా ఏదో తెలుసా…?

by AJAY
Ad

ప‌విత్రాలోకేష్ ఈ పేరుకు ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. మొన్నటి వ‌ర‌కూ ప‌విత్ర‌లోకేష్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా మాత్ర‌మే తెలుసు. ఇక ఇండ‌స్ట్రీలో చాలామంది క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు ఉన్నారు కాబ‌ట్టి ప‌విత్ర కూడా అందరిలో ఒక‌రిగా ఉండేవారు. కానీ గ‌త కొద్దిరోజులుగా ప‌విత్రాలోకేష్ త‌ర‌చూ వార్త‌ల్లో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. దానికి కార‌ణం ప‌విత్ర న‌టుడు న‌రేష్ తో డేటింగ్ లో ఉండ‌ట‌మే. ఇండ‌స్ట్రీలో చాలామంది న‌టీన‌టులు డేటింగ్ చేస్తుంటారు అది కామ‌న్. కానీ లేటు వ‌య‌సులో ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ‌టం ఆ త‌ర‌వాత డేటింగ్ చేయ‌డం వ‌ల్ల‌నే ఇద్ద‌రూ వార్త‌ల్లో నిలిచారు.

Advertisement

మ‌రోవైపు ప‌విత్రాలోకేష్ న‌రేష్ క‌లిసి ఓ హోట‌ల్ లో ఉన్న స‌మ‌యంలో న‌రేష్ మూడో భార్య వ‌చ్చి ర‌చ్చ చేసింది. రెడ్ హ్యాండెడ్ గా ఇద్ద‌రూ మీడియా ముందు ప‌ట్టుబ‌డ‌టంతో వార్త‌ల్లో హెడ్ లైన్స్ గా మారింది. ఇదిలా ఉంటే ప‌విత్ర లోకేష్ ఇటీవ‌ల వార్త‌ల్లో నిలుస్తుంది కానీ ఆమె ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియ‌దు. ప‌విత్ర లోకేష్ క‌న్నడ ఇండ‌స్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ప‌రిచ‌యం అయ్యింది.

Advertisement

ప‌విత్రాలోకేష్ తండ్రి కూడా ఒక‌ప్పుడు న‌టుడిగా చాలా సినిమాలు చేశారు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా న‌టించిన ప‌విత్ర ఆ త‌ర‌వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ప‌విత్రాలోకేష్ హీరోయిన్ గా పెద్ద‌గా గుర్తింపు తెచ్చుకోలేదు. ఒకానొక స‌మ‌యంలో పవిత్ర అప‌విత్ర‌మైన పాత్ర‌ల‌లో సైతం న‌టించింది. మ‌రోవైపు ప‌విత్రాలోకేష్ ఓ అద్భుత‌మైన సినిమాలోనూ న‌టించింది.

నాయి నెర‌ళు అనే న‌వ‌ల ఆదారంగా తెర‌కెక్కిన సినిమాలో ప‌విత్ర లోకేష్ న‌టించింది. ఈ సినిమాలో భ‌ర్త చ‌నిపోయిన స్త్రీ పాత్ర‌లో న‌టించగా త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. అంతే కాకుండా గుండుతో నాచుర‌ల్ గా క‌నిపించింది. ఈ సినిమాకు నేష‌న‌ల్ అవార్డ్ రావాలి కానీ జ‌స్ట్ మిస్…కానీ ఈ సినిమాలో ప‌విత్ర న‌ట‌న‌కు సినిమాకు చాలా అవార్డులు వ‌చ్చాయి.

Visitors Are Also Reading