Home » మన దగ్గర ఫ్రీ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఏవో మీకు తెలుసా..?

మన దగ్గర ఫ్రీ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఏవో మీకు తెలుసా..?

by Azhar
Published: Last Updated on
Ad

2020ని ఇప్పుడు ఉన్న ప్రజలు ఎవరు మరిచిపోరు ఎందుకంటే అప్పుడు వచ్చిన హీరోనా అనే వైరల్ మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేసి స్థంబింపజేసింది. ఈ వైరల్ కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వదతి లాక్ డౌన్ లో భాగంగా ఆరు నెలలకు పైగా ఇంట్లోనే గడపాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా కరోనా కేసులు, ఆంక్షలు ఉండటంతో బయటకి వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఈ క్రమంలోనే ప్రజలు కొంత ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీని ఎంచుకున్నారు. చాలా వరకు సినిమాలు కూడా నేరుగా ఇందులో విడుదల అయ్యాయి.

Advertisement

ఇక ప్రజలు ఎక్కువగా వస్తుండటంతో ఓటీటీ సంస్థలు తమ ఇష్టానికి ప్యాకేజీలను పెంచేసాయి. దాంతో ప్రజల జేబులకు చిల్లులు పడటం ప్రారంభమైంది. కానీ మన దేశంలో ఫ్రీ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా ఉన్న విషయం చాలా మందికి తెలియదు. ఇందులో మనం ఫ్రీగా సినిమాలు చూడవచ్చు. అయితే ఈ ఫ్రీ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఎక్కువ మందికి తెలిసింది ఎంఎక్స్ ప్లేయర్. ఇందులో చాలా సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్లు కూడా ఉన్నాయి. వీటిని మనం ఉచితంగానే చూడవచ్చు.

Advertisement

అలాగే జియో టీవీ కూడా ఇందులో ఒక్కటి. కానీ ఇది కేవలం జియో యూజర్లకు మాత్రమే ఉచితం. ఇందులో మన టీవీ లైవ్ కూడా చూడవచ్చు. దీని లాగే ఎయిర్టెల్ ఎక్స్ స్ట్రీమ్ మరియు వోడాఫోన్ ఐడియా మూవీస్ అండ్ టీవీ అనేవి ఉన్నాయి. ఇవి కూడా కేవలం ఆ సిమ్స్ వాడే యూజర్లకు మాత్రమే ఫ్రీ. వీటితో పాటుగా టీవీఎస్ ప్లే అనే ఇంకో ఓటీటీ ప్లాట్ ఫామ్ ఉంది. ఇందులో కూడా కేవలం లాగ్ ఇన్ అయ్యి చూడటమే. అయితే ఇవ్వని ఫ్రీ కావడంతో మధ్య మధ్యలో యాడ్స్ అనేవి ఉంటాయి.

ఇవి కూడా చదవండి :

ఈపీఎల్ కంటే మన ఐపీఎల్ బెస్ట్ అంటున్న గంగూలీ..!

Visitors Are Also Reading