ప్రపంచంలోనే అత్యంత రెండో ఖరీదైన క్రీడా లీగ్ గా మన బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్ ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాదే ఐపీఎల్ మీడియా హక్కుల రూపంలో బీసీసీఐ 48 వేల కోట్లు ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటె.. ఐపీఎల్ 2022 లో రెండు కొత్త జట్లు అనేవి ఎంట్రీ ఇవ్వడంతో.. ఈ ఐపీఎల్ కోసం బీసీసీఐ మెగా వేలం అనేది.. ఫిబ్రవరిలో బెంగళూర్ వేదికగా బీసీసీఐ నిర్వహించింది.
Advertisement
కానీ వచ్చే ఏడాది ఐపీఎల్ 2023 కోసం బీసీసీఐ మినీ వేలిని నిర్వహిస్తుంది. అయితే ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ 2022 సీజన్ లోని మ్యాచ్ ల కంటే ఐపీఎల్ 2023 లో మ్యాచ్ ల సంఖ్య అనేది పెరగనుంది అనేది తెలిసిందే. ఇందుకోసం ఐసీసీ కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా బీసీసీఐ వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం నిర్వహించే మినీ వేలంను ఫిక్స్ చేసింది.
Advertisement
ఈ మినీ వేలం అనేది ఈ ఏడాది మెగా వేలం ఎక్కడ జరిగిందో.. అదే బెంగళూర్ వేదికగా జరగనుంది అని తెలుస్తుంది. ఇక ఈ వేలంను ఈ ఏడాది డిసెంబర్ 16వ తేదీన నిర్వహించబోతున్నారు. ఇక ఐపీఎల్ 2022 వరకు ఫ్రాంచైజీల పర్స్ వాల్యూ అనేది 90 కోట్లుగా ఉంది. కానీ ఈ మినీ వేలంనుండి అది 95 కోట్లు కానుంది అని తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :