వేసవికాలంలో లభించే అద్భుతమైన సీజనల్ ఫ్రూట్స్ లో ఖర్బూజ ఒకటి. ఎండాకాలంలో తీవ్రమైన వేడి నుంచి శరీరాన్ని చల్లబరచడంలో ఈ పండు కీలక పాత్రను పోషిస్తుంది. విటమిన్ ఏ, సీ, ఫైబర్ అధికంగా ఉంటాయి. శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వాటర్ కంటెంట్ మోతాదు కూడా ఇందులో చాలా ఎక్కవనే. దీంతో వేసవిలో వడదెబ్బ తగలకుండా శరీరం హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు. ఖర్భూజను రోజు తీసుకుంటే.. బరువు కూడా తగ్గవచ్చు. అందుకు గల కారణాలు ఏంటో తెలుసుకుందాం.
Also Read : హీరో హీరోయిన్లు వాడే లక్షల విలువచేసే దుస్తులను ఏం చేస్తారో తెలుసా.?
Advertisement
ఖర్బూజలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో చాలా కీలకంగా పని చేస్తుంది. ఈ వేసవి పండులో నీటి శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. తరచూ దీనిని తినడం వల్ల పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఫలితంగా ఆకలి తగ్గుతుంది. దీంతో ఇతర ఫుడ్స్‌ను ఎక్కువ మోతాదులో తినలేరు. బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
Advertisement
ఖర్బూజలో మెలోన్ అనే పీచు పదార్థం ఉంటుంది. ఈ పండును క్రమం తప్పకుండా తిన్నట్టయితే.. శరీరానికి చల్లదనంతో పాటు జీర్ణవ్యవస్థ పనితీరు వేగవంతం అవుతుంది. ఖర్బూజ శరీరంలోని నీటిని సంగ్రహిస్తూ జీవక్రియ రేటును పెంచుతుంది. జీవక్రియ రేటు ఎక్కువగా ఉన్నప్పుడు, శరీరంలోని కొవ్వు కూడా ఆటోమెటిక్‌గా వేగంగా కరుగుతుంది. దీంతో బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది.
ఖర్బూజ రుచికి చాలా తియ్యగా ఉంటుంది. వేసవిలో చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు అందరూ చాలా ఇష్టంగా ఈ పండును తింటుంటారు. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది తీపి పదార్థాలను తినాలనే కోరికను తగ్గిస్తుంది. దీని ద్వారా బరువు తగ్గడానికి కృషి చేస్తుంది.
Also Read : Venkatesh: రాత్రి పగలు తేడా లేకుండా భార్యను అలాంటి పనులు చేయాలని విసిగిస్తాడా..?