చాలామంది రాత్రిపూట ఆలస్యంగా భోజనం తింటూ ఉంటారు. రాత్రిపూట ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వలన ఇబ్బంది ఉంటుంది తప్ప ప్రయోజనం ఉండదు. రాత్రిపూట ఆలస్యంగా అసలు తినకూడదు. రాత్రిపూట 8 గంటల లోపు ఆహారాన్ని తీసుకుంటే మంచిది. కుదిరితే ఆరు ఏడు గంటలకి డిన్నర్ చేసేయడం మంచిది. రాత్రిపూట త్వరగా ఆహారాన్ని తీసుకోవడం వలన ఈజీగా జీర్ణం అవుతుంది. జీర్ణ సమస్యలు ఏమి కూడా కలగవు. మలబద్ధకం సమస్య కూడా ఉండదు. కానీ రాత్రిపూట ఆలస్యంగా ఆహారాన్ని తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు, మలబద్ధకం వంటివి కలుగుతాయి. రాత్రిపూట తేలికపాటి ఆహార పదార్థాలను తీసుకోవాలి.
Advertisement
Advertisement
బాగా హెవీగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. తేలికగా అరిగే ఆహార పదార్థాలను తీసుకుంటే బీపీ, షుగర్ ఉన్నవాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. రాత్రిపూట త్వరగా భోజనం చేయడం వలన బీపీ, గుండె జబ్బులు దూరమవుతాయి. రాత్రిళ్ళు త్వరగా తినేయడం వలన చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. అలానే ఉదయం పూట అసలు ఆహారాన్ని స్కిప్ చేయకండి. శరీరానికి కావాల్సిన శక్తి మనకి అల్పాహారమే ఇస్తుంది. ఉదయం పూట హెవీగా తీసుకోవడం, రాత్రిపూట లైట్ గా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అధిక బరువు, బీపీ, గుండె జబ్బులు ఇటువంటివి కూడా ఉండవు. ఆరోగ్యంగా ఉండొచ్చు.
Also read:
- Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. 17-09-2023 నుంచి 23-09-2023
- చంద్రబాబు విషయంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒకేమాట మీద ఉండటానికి కారణమేంటి..?
- ‘సైమా’ అవార్డ్స్ లో శ్రీలీల వేసుకున్న డ్రెస్ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!