Home » నాన‌బెట్టిన బాదం తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా ?

నాన‌బెట్టిన బాదం తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా ?

by Anji
Ad

బాదం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ఇక ప్రత్యేకంగా చెప్పన అవ‌స‌ర‌మే లేదు. పిల్లల నుంచి పెద్దల వరకు తినగలిగే ఆహారంలో బాదంపప్పు ఒకటి. సూపర్ ఫుడ్ గా పిలవబడే భాదంలో న్యూట్రీషియన్స్, విటమిన్స్, ఫైబర్, మెగ్నీషియం, ఒమేగా3, ఫ్యాటీయాసిడ్స్, ప్రోటీన్స్ అత్యధికంగా ఉన్నాయి. ఇవి మంచి ఆరోగ్యానికి తోడ్పడుతాయి. బాదంను క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Advertisement

అలాగే బాదం ప్రతిరోజు తినడం వల్ల ఇన్సులిన్ స్థాయి అదుపులో ఉంటుంది. ఇవి గ్లూకోజ్ ను శరీరం బాగా శోషించుకునేలా చేస్తాయి. తద్వారా మధుమేహం అదుపులో ఉంటుంది. అయితే నానబెట్టిన బాదం తినొచ్చా.? అన్నది చాలామందిలో ఉండే సందేహం. వాస్తవానికి కొందరు నానబెట్టిన బాదం తింటే. మరికొందరు బాదంను డైరెక్ట్ గా తింటుంటారు. వాస్త‌వానికి నానబెట్టిన బాదం పప్పులు తినడమే ఆరోగ్యానికి మంచిది. మంచిది ఎందుకు అంటే..? బాదం పప్పుల మీద ఉండే తొక్కలో టానిన్ అనే పదార్థం ఉంటుంది. అది మన శరీరం పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. ఎప్పుడైతే బాదం పప్పులని నానబెట్టామో, అప్పుడు ఆ తొక్క ఊడిపోతుంది.

Advertisement

Also Read :  భార్య భర్తని ఆ ఒక్క విషయంలో మాత్రం దూరం పెట్టకూడదు..పెను ప్రమాదమే..!!

అలా తిన్న బాదం మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందులోను ముఖ్యంగా రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇలా క్రమం తప్పకుండా బాదంను తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపరుగుతుంది. ఇక బరువు తగ్గాలనుకునే వారికి బాదం ఎంతగానో సహాయపడుతుంది. ఎందుకంటే బాదం లో ఉండే మోనో శ్యాచురేటెడ్ ఎక్కువ సమయం పొట్ట ఫుల్ గా ఉంచుతుంది. ఈ క్రమంలోనే ఆకలి తగ్గిస్తుంది. తద్వారా బరువు తగ్గొచ్చు. భాదంలో ఉండే బి17 లో న్యూట్రీషియన్స్ క్యాన్సర్ నివారణలో సహాయపడతాయి.

Also Read :  మీకు ఎంత‌కు నిద్ర రావ‌డం లేదా..? అయితే ఓసారి ఈ ప్ర‌య‌త్నం చేయండి..!

Visitors Are Also Reading