సాధారణంగా మనం ఏ సీజన్ లో వచ్చే పండ్లను ఆ సీజన్ లో తింటే మనకు పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ప్రస్తుతం ఈ సీజన్ లో సపోట పండ్లు మార్కెట్ లో విరివిగా లభిస్తున్నాయి. ఈ పండు చాలా రుచికరంగా ఉంటుంది. సపోటా పండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. ఇందులో ఉండే కాల్షియం, ఫైబర్, ఐరన్, కాపర్, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ బీ, విటమిన్ సి వంటి చాలా రకాల పోషకాలుంటాయి. వీటిని రోజుకు రెండు చొప్పున తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్యాన్ని మన సొంతం చేసుకోవచ్చు.
Also Read : ఇడ్లీ ఫస్ట్ ఎక్కడ పుట్టిందో తెలుసా ?
Advertisement
సపోటా పండ్ల వల్ల కలిగే ప్రయోజనాలు :
- సపోటా పండ్లను తినడం వల్ల మీ యొక్క జీర్ణశక్తి చాలా మెరుగుపడుతుంది. కడుపులో ఉన్నటువంటి వ్యర్థాలు కూడా వాటంతట అవే తొలగిపోతాయి. పొట్ట, ప్రేగులు పరిశుభ్రం అవుతాయి. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఈ పండు తినడంతో కంటి చూపు మెరుగు అవుతుంది.
- అదేవిధంగా వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా చేస్తాయి. సపోట పండ్లు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటాం. ముఖ్యంగా నీరసంగా ఉన్నప్పుడు సపోట పండు తినడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది.
- నిద్రలేమి సమస్యతో బాధపడేవారు సపోటా పండ్లను తింటే వారికి అద్భుతమైన ఫలితముంటుంది. గర్భిణీ స్త్రీలు, బాలింతలు కూడా ఈ పండ్లను తీసుకోవడంతో మంచి ఫలితాలుంటాయి.
Advertisement
- మూత్ర పిండాల సమస్యలతో బాధపడేవారు సపోటా పండ్లను తినడం వల్ల వారికి మంచి ఫలితముంటుంది. ముఖ్యంగా మూత్ర పిండాల్లో రాళ్లు సైతం కరుగుతాయట. అదేవిధంగా బరువు తగ్గడంలో, జుట్టు రాలడాన్ని తగ్గించడంలో, ఎముకలను ధృడంగా తయారు చేయడంలో ఉపయోగపడుతుంది.
- రక్తపోటును అదుపులో ఉంచడంలో కూడా ఈ పండ్లు ఉపయోగపడుతాయి. నరాల ఒత్తిడిని, శరీర బలహీనతను తగ్గించడంలో సపోటా పండ్లు చాలా ఉపయోగపడుతాయి.
- సపోటా పండ్లను పురుషులు తినడం వల్ల వారిలో వచ్చే *గిక సమస్యలు కూడా తగ్గుతాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ సీజన్ లో లభించే సపోట పండ్లను తిని ఆరోగ్యంగా ఉండండి.
Also Read : ఉదయం నిద్ర లేవగానే మీకు నీరు తాగే అలవాటు ఉందా ? దీంతో అద్భుతమైన ప్రయోజనాలు..!