Home » చలికాలంలో నెయ్యి తినవచ్చా..? తింటే ఏం జరుగుతుందంటే..?

చలికాలంలో నెయ్యి తినవచ్చా..? తింటే ఏం జరుగుతుందంటే..?

by Anji
Ad

చాలామందికి నెయ్యి అంటే చాలా ఇష్టం ఉంటుంది. ప్రతి ఆహార పదార్థాలతో పాటు అన్నంలో కూడా నెయ్యి కచ్చితంగా వేసుకొని తింటారు. తినడానికే కాదు వంటలకు కూడా ఉపయోగిస్తారు. నెయ్యితో చేసిన వంటలు చాలా రుచిగా ఉంటాయి. అయితే చలికాలంలో నెయ్యి ఎక్కువగా తినొచ్చా.? తినకూడదా.? అనే సందేహం ఉంటుంది. చలికాలం వచ్చిందంటే చాలా ఆరోగ్యం పై శ్రద్ధ పెడుతూ ఉంటారు. ప్రతి చిన్న దానికి ఏదో ఒక రకమైన సమస్య అందరినీ వేధిస్తూ ఉంటుంది. దానివల్ల కొంతమంది ఏమైనా తినాలంటే భయపడుతూ ఉంటారు. చలికాలంలో నెయ్యి ఎక్కువగా తీసుకోవచ్చా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ చలికాలంలో ఎక్కువగా జలుబు, గ్యాస్ సమస్యలు, శ్వాస తీసుకోవడం, ఆస్తమా వంటి సమస్యలు మనల్ని వేధిస్తాయి. ఈ కాలంలో యాంటీ బయోటిక్స్ ఎక్కువగా తినడం వల్ల శరీరానికి మంచిది కాదు. చలికాలంలో నీళ్లు తక్కువగా తాగుతారు కావున ఆరోగ్యంపై మరి ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతుంటారు. అయితే, కొందరికి నెయ్యి తీసుకోవాలా వద్దా అనే డౌట్ ఉంటుంది. చలికాలంలో నెయ్యి తింటే జలుబు వస్తుందని కొందరిలో భయం ఉంటుంది. మార్కెట్ లో దొరికే నెయ్యి లో కల్తీ ఉంటుంది కాబట్టి ఇంట్లో నెయ్యి చేసుకుని తినడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. కాగా.. నెయ్యి తినడం వల్ల బరువు పెరగడతారని కొంతమంది అనుకుంటారు. నిజానికి నెయ్యి తింటే ఆరోగ్యంగా ఉంటాము. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు మన కడుపుని నిండుగా ఉంచుతుంది. ఫలితంగా తినడం తగ్గుతుంది. దీనివల్ల బరువు అదుపులో ఉంటుంది.

Advertisement

Advertisement


అంతేకాకుండా, జీర్ణ సమస్యలు ఉంటే నెయ్యి తినడం వలన ఈ సమస్య దూరం అవుతుంది. మనం తినే ఆహారంలో రోజూ కొద్దిగా నెయ్యి తింటే జీర్ణ వ్యవస్థకు ఎంతో మంచిది. మలబద్దక సమస్య ఉన్నవారు నెయ్యి తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు శక్తి పెంచడంతో పాటు, శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. ఫలితంగా ఎముకలు, కీళ్ల నొప్పుల సమస్య నుంచి నెయ్యి దూరం చేస్తుంది. చలికాలంలో చర్మం పగలకుండా ఉండాలంటే నెయ్యిని కచ్చితంగా తీసుకోవాలి. ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో నెయ్యి ప్రధాన పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading