ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలంటే ఒకటికాదు. ఎన్నో మార్గాలుంటాయి. కానీ ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మాత్రం దానికి కాస్త శ్రమపడాల్సి ఉంటుంది. కొన్ని సహజసిద్ధంగా జరిగే విషయాలు కూడా మనం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. అందులో ఒకటి ఏడవడం నిజమే. ఏడవడం కూడా ఆరోగ్య లాభాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.
Advertisement
సరైన ఆహారం, యోగా వ్యాయామం లాంటివి శరీరానికి ధృడంగా ఉంచుకోవడానికి ఆరోగ్యంగా ఉండడానికి ఎవరైనా చేస్తారు. కానీ ఏడవడం అలా కాదు. అది మనకు ఎవరూ నేర్పించరు. అసలు మనిషి జీవితంలో నేర్చుకునేది ఏడుపే. బాధ కలిగినా, సంతోషం కలిగినా ముందుగా మనిషి కళ్లల్లో కూడా కన్నీరు రావడం సహజం. ఆరోగ్య ప్రయోజనాలుంటాయట.
Advertisement
సాధారణ ఎవరైనా బాధలో ఉన్నప్పుడూ అదంతా ఒక్కసారిగా కన్నీరు రూపంలో బయటికి రావాల్సిందే. ఒకవేళ అలా రాకపోతే మనస్సు బరువెక్కిపోతుంది. దాని వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే సమస్యలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చాలా మంది బాధను బయటివారితో చెప్పలేక లోపలోనే కుమిలిపోవడం వల్ల డిప్రెషన్‌కు లోనవుతారు. ఇది అన్నింటికన్నా సీరియస్ సమస్య. అయితే అలా జరగకుండా ఉండాలంటే.. ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చేసి ఆ బాధను బయటికి పంపించేస్తే బెటర్. ఏడవడం వల్ల కలిగే మానసిక లాభాల గురించి ఎక్కువ శాతం మందికి తెలుసు. కానీ దీని వల్ల శారీరక లాభాలు కూడా ఉన్నాయట.
మనిషి శరీరంలోని సెన్సిటివ్ భాగాల్లో కళ్లు కూడా ఒకటి. ఈ కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవడం ఒక్కటే వీటిని ఇతర సమస్యల నుంచి దూరంగా ఉంచడానికి పరిష్కారం అయితే ఏడవడం వల్ల కళ్లలో డ్రైనేస్ పోతుంది. ఏడవడం వల్ల కళ్లకు ఎక్కువగా దురద పెట్టే అవకాశం కూడా ఉండదు. అదేకాకుండా కళ్లు ఎర్రగా అవ్వడాన్ని తగ్గిస్తుంది.