సాధారణంగా గుమ్మడి కాయను ఇంటి ముందు గడప దగ్గర కట్టడానికి మాత్రమే ఉపయోగిస్తుంటారు. అదేవిధంగా శుకార్యాల సమయాలలో వీటిని వాడుతుంటారు. కొందరూ మాత్రమే గుమ్మడికాయతో వంటకాలు చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ శాతం మంది గుమ్మడి కాయ తినడానికి సుముఖంగా ఉండరు. కానీ గుమ్మడి కాయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాకుండా గుమ్మడి గింజలు ఆరోగ్యానికి మంచివి.
Advertisement
ఇందులో అనేక పోషకాలుంటాయి. ఇవి చర్మానికి పొట్టకు, ఇతర శరీర అవయాలకు ఆరోగ్యాన్ని అందిస్తాయి. ముఖ్యంగా స్త్రీలకు గుమ్మడి గింజలు మంచివి. పీరియడ్స్ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. వ్యాయామ శాఖ డైరెక్టర్ మిస్టర్ ఫిట్బీ గుమ్మడి గింజలు మహిళల ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలిపారు. ఫెల్విక్ ఇన్ల్పేటరీ ఉన్న మహిళలకు ఇవి ప్రత్యేకంగా ఉపయోగపడుతాయి. గుమ్మడి గింజలను గనేరియాతో బాధపడుతున్న మహిళలక ఇవ్వడం వల్ల అనేక రకాల సమస్యలు తగ్గుతాయి. ఇందులో కుకర్బిటాసిన్ అనే ప్రత్యేకమైన ఆమ్లం ఉంటుంది. అలాగే ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది జుట్టు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
Advertisement
అదేవిధంగా గుమ్మడి గింజలు శరీరంలోని కొవ్వు పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా అండాశయ క్యాన్సర్ ఉన్న మహిళలకు అధిక కొలెస్ట్రాల్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే గుమ్మడి గింజల్లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. మహిళల్లో ఓవేరియన్ సిండ్రోమ్ వలన కలిగే రక్తపోటును తగ్గిస్తుంది. అదేవిధంగా మహిళలకు పీరియడ్స్ సమయంలో బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశముంది. మహిళలు గుమ్మడి గింజలను తింటే ఆస్టియోపోరోసిస్ సమస్య తగ్గుతుంది. గుమ్మడికాయ గింజలు ఎముకల వ్యాధిని కూడా తగ్గిస్తాయి.
Also Read : దేవాలయాల్లో చేయకూడని పనులు ఏవో తెలుసా..?